‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa The Lion King) వస్తోంది. డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దీనికి దర్శకుడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ముఫాసా తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దాంతో ఈ ప్రీక్వెల్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లు మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో ఆసక్తి రేపుతున్నారు.ఈ మేరకు మహేష్ బాబు కుమార్తె సితార సైతం తనదైన ప్రమోషన్స్ చేస్తోంది.
తాజాగా సితార ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మాట్లాడుతూ.. ‘ముఫాసా పాత్రకి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా.. గర్వంగా ఉందని తెలిపింది. ముఫాసా ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి.. అందుకు నాన్న వాయిస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందని సితార తెలిపింది. అలాగే ఈ పాత్ర కోసం మహేష్ బాబు ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు.. నిజజీవితంలోనూ పిల్లలపై కేరింగ్ విషయంలో ముఫాసాకి నాన్నకు దగ్గర పోలికలున్నాయని సితార వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :- ఉస్తాద్ ఆస్తి 8.48 కోట్లు.. ఒక్క కచేరీకి ఎన్ని లక్షలు అందుకునేవారంటే?
ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్లో డైలాగ్స్: ''అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది'' అంటూ ట్రైలర్‌లో వినిపించిన మహేష్ మొదటి మాట.
అలాగే 'నేనుండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు'..అనే ఈ మాటలో మహేష్ హీరోయిజం ఉంది. ఆ మాట మహేష్ బాబు చెప్పడం వల్ల ట్రైలర్ మరింత ఎలివేట్ అయ్యింది. 'మనం ఒక్కటిగా పోరాడాలి' అని మహేష్ చెప్పిన మాట సైతం ఆకట్టుకుంటోంది.