Maharaja China Box Office: ఇది కదా మక్కల్ క్రేజ్ అంటే.. చైనాలో రికార్డ్ వసూళ్లతో మహారాజ మూవీ

నితిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన 'మహారాజ '(Maharaja) మూవీ ఇండియాలో 2024 జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవలే నవంబర్ 29న  చైనాలో రిలీజై  మహారాజా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అక్కడ రోజు రోజుకి పెరుగుతున్న పాజిటీవ్ టాక్ తో కలెక్షన్స్ కూడా అదరగొడుతోంది.

చైనాలో దాదాపు 40 వేల థియేటర్స్లో రిలీజైన మహారాజ మూవీ.. బాక్సాపీస్ వ‌ద్ద రూ.40 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించించిన‌ట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. కేవలం ప్రివ్యూలలో రూ.5.41 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రిలీజైన (నవంబర్ 29) ఫస్ట్ డే రూ.4.57 కోట్లు రాబట్టింది. అంతేకాదు ఈ మూవీకి ఓవర్సీస్‌లో 25 కోట్ల బిజినెస్ చేసింది. 

Also Read : జపనీస్ భాషలో ప్రభాస్ కల్కి మూవీ

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. మహారాజా ఫస్ట్ వీక్ ప్రీమియర్‌లతో కలిపి రూ.40.44 కోట్లు వసూలు చేసింది. నిన్న Dec6న రూ.65 లక్షలు దాటింది. ఇక చైనా బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ కలెక్షన్ రూ.41.09 కోట్లు రాబట్టింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. రూ.20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మహారాజా మూవీ కేవలం తెలుగులోనే 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ ఇండియా వైడ్గా రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. దీంతో మహారాజ వరల్డ్ వైడ్గా రూ.150కోట్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం చైనా ప్రేక్షకులు విజయ్ సేతుపతి నటనకు బ్రహ్మరథం పడుతన్నారు. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కొత్త మైలురాయిని ఆవిష్కరించేలా చూస్తున్నారు. ఇది కదా మక్కల్ రికార్డ్ అంటే!