Keerthy Suresh: ఆఫిషియల్.. కీర్తీ సురేష్ పదిహేన్ల ప్రేమ.. వివాహ బంధంలోకి.. ఎవరీ ఆంటోనీ..?

మహానటి కీర్తీ సురేష్ (Keerthy Suresh) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిళ్‌ని (Antony Thattil) పెళ్లి చేసుకోబోతున్నట్లు బుధవారం (2024 నవంబర్ 27న) అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా కీర్తి సురేష్ X వేదికగా తన పదిహేన్ల ప్రేమ.. వివాహ బంధంలోకి అడగుపెట్టబోతున్నట్లు పోస్ట్ పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీతో దిగిన ఫొటోని షేర్ చేసింది. ఇన్నాళ్లు కీర్తీ సురేష్ పెళ్లిపై వస్తోన్న రూమర్స్కు లేటెస్ట్ పోస్ట్తో చెక్ పెట్టింది.

Also Read :- ఫస్ట్ పార్ట్ని మించేలా విడుదలై-పార్ట్2 ట్రైలర్

ఇటీవలే దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది. తాజాగా దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై పెళ్లితో ఒక్కటవ్వనుందని తెలిపింది. దాంతో సినీ సెలెబ్రేటిస్, ఫ్యాన్స్ విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మొదట కీర్తీ పోస్ట్‌పై హీరోయిన్ రాశీఖన్నా ట్వీట్ చేస్తూ.. "మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్‌ లవ్‌" అని విష్ చేసింది. ఆ తర్వాత మాళవికా మోహనన్, త్రిష, అపర్ణాబాల మురళి, సంయుక్తా మేనన్, నిక్కీ గల్రానీ, అనపమా పరమేశ్వరన్, హీరో అరుణ్ విజయ్, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల శుభాకాంక్షలు తెలిపారు.  కాగా వీరి వివాహం డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఎవరీ ఆంటోనీ..?

కేరళకు చెందిన ఆంటోనీ వ్యాపార వేత్తగా రాణిస్తున్నాడు. ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడని.. ప్రస్తుతం అతనికి కేరళలో పలు బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు అతనికి రూ.300 కోట్ల నెట్ వర్త్ ఉన్నట్లు సమాచారం.