Kanguva OTT: ఓటీటీలోకి సూర్య కంగువ మూవీ.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ తెరకెక్కించినచిత్రం ‘కంగువ’(Kanguva). కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 14న రిలీజై మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది.

సూర్య వ‌న్ మెన్ షోగా ఈ సినిమా నిలిచిందని.. ఏ ఒక్కరి క్యారెక్టర్ తోను ఎమోషన్ను కనెక్ట్ చేయలేదని.. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని టాక్ వచ్చింది. దానికి తోడు సినిమాపై భారీ అంచనాలు ఉండడం.. అది ఫస్ట్ డే టాక్ తోనే తలక్రిందులవ్వడం నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ రన్ దాదాపు ముగిసినట్టే అని తెలుస్తోంది. దాంతో కంగువ ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అయినట్లు టాక్. వివరాల్లోకి వెళితే.. 

దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన కంగువ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమాని థియేటర్లలో రిలీజైన ఆరు-ఎనిమిది వారాల్లోపు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా టాక్ వచ్చింది. అయితే ఇపుడు కంగువ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్లో మార్పు వచ్చినట్లు సమాచారం.

థియేట్రికల్ రన్తో కంగువ పూర్తిగా ఫెయిల్ అవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే కంగువ మూవీ డిసెంబర్ 13 న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.