కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ తెరకెక్కించినచిత్రం ‘కంగువ’(Kanguva). కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 14న రిలీజై మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. సూర్య వన్ మెన్ షోగా ఈ సినిమా నిలిచిందని.. ఏ ఒక్కరి క్యారెక్టర్ తోను ఎమోషన్ను కనెక్ట్ చేయలేదని.. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని టాక్ వచ్చింది. దానికి తోడు సినిమాపై భారీ అంచనాలు ఉండడం.. అది ఫస్ట్ డే టాక్ తోనే తలక్రిందులవ్వడం నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది.
ఇక లేటెస్ట్ విషయానికి వస్తే.. కంగువ ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అయింది. తాజాగా కంగువ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అండ్ ప్లాట్‌ఫామ్ రివీల్ చేశారు. డిసెంబర్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. "కాలం అంత పాత కథ మరియు ఒక వారసత్వం..ఇక వాటన్నిటినీ పరిష్కరించేందుకు కంగువ వస్తాడు" అంటూ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.అయితే, ముందుగా డిసెంబర్ 13న స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది.
Also Read:-సన్నీడియోల్ - గోపిచంద్ మలినేని మూవీ..
దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కంగువ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సుమారు రూ.100 కోట్లతో కంగువ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు టాక్.
A tale as old as time ⚔️ & a LEGACY that lives on ?
— prime video IN (@PrimeVideoIN) December 6, 2024
KANGUVA arrives to settle it all ?#KanguvaOnPrime, Dec 8 pic.twitter.com/eDLqMDd2hD
అయితే, ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శివ కథ కంటే సూర్య ఇమేజ్, అతడి హీరోయిజాన్ని నమ్ముకొనే ఈ సినిమాను తీశాడేమో అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, కంగువ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్, అప్పుడు వచ్చే విజువల్స్ బాగున్నాయి. కానీ రెండు కాలాల మధ్య రాసుకున్న కథకు కనెక్షన్ అర్థవంతంగా చెప్పడంలో డైరెక్టర్ శివ విఫలమయ్యాడు.