ThugLife: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న కమల్-మణిరత్నం థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ ఇదే

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)- దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)..ఈ గ్రేటెస్ట్ కాంబో నుంచి థ‌గ్‌లైఫ్ (Thug Life) సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబో ఎంతో స్పెషల్. 1987లో వచ్చిన నాయకన్ మూవీ..తెలుగులో నాయకుడు గా రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మరోసారి జతకట్టనున్న ఈ కాంబో నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఇవాళ గురువారం (నవంబర్ 7న) కమల్ హాసన్ బర్త్డే స్పెషల్గా థ‌గ్‌లైఫ్ టీజర్ రిలీజ్ చేసారు. "పయనీర్, ట్రైల్‌బ్లేజర్, మెంటర్ - ఇటువంటి పదాలు భారతీయ సినిమా మరియు సమాజంపై మీ ప్రభావాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. విశ్వ నాయకుడు.. థ‌గ్‌లైఫ్ సినిమా కొరకు తన అసమానమైన విజన్‌తో ముందుకొస్తున్నాడు.. పుట్టినరోజు శుభాకాంక్షలు కమల్ సార్" అంటూ మేకర్స్ విషెష్ తెలిపారు. 

అతని కథ, అతని నియమాలు అంటూ క్యాప్షన్తో రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే థగ్ లైఫ్ టీజర్ మరో లెవెల్లో ఉంది. మణిరత్నం టేకింగ్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజన్స్, ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అలాగే మోస్ట్ స్టైలీష్గా శింబు ఎంట్రీ నెక్స్ట్ లెవల్లో ఉంది. శింబు విలన్ (క్రిమినల్) పాత్రలో తన మార్క్‌ ప్రెజెన్స్తో, స్టైలిష్‌ ఎంట్రీతో ఆకట్టుకున్నాడు.

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. కమల్‌ 234వ చిత్రంగా థగ్‌ లైఫ్‌ సినిమా రూపొందబోతుంది.

ఈ ప్రెస్టీజియస్ సినిమాలో శింబు, దుల్కర్ సల్మాన్‌, జయం రవి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, ఐశ్వర్యలక్ష్మి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా 2025 జూన్ 5న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.