IIFA Utsavam 2024: అంగరంగ వైభవంగా ఐఫా అవార్డుల వేడుక.. విజేతలు వీరే..

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 2024 ఐఫా వేడుకలు (International Indian Film Academy Awards) అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.

ముఖ్యంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, విక్టరీ వెంకటేశ్‌, బాలకృష్ణ, ఏఆర్‌ రెహమన్‌, సమంత, దర్శకుడు మణిరత్నం, రానా త‌దిత‌రులు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

ఈ వేడుకలో తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలలోని ప్రతిభావంతులను పురస్కారాలతో సత్కరించింది. మరి ఎవరెవరు..ఏ విభాగాల్లో అవార్డులు అందుకున్నారో చూద్దాం. కాగా నాని దసరా మూవీ IIFA అవార్డుల బరిలో ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ అయ్యి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 

ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా-  చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా - ప్రియదర్శన్‌
ఉమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ - సమంత
గోల్డెన్‌ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ)- రిషబ్‌ శెట్టి
ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా
ఉత్తమ నటుడు (తెలుగు)- నాని 
ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్‌
ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ విలన్‌ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
ఉత్తమ విలన్‌ (తెలుగు) - షైన్‌ టామ్‌ (దసర)
ఉత్తమ విలన్‌ (కన్నడ) - జగపతి బాబు
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం - జైలర్‌ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నేపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ విలన్‌ (మలయాళం) - అర్జున్‌ రాధాకృష్ణన్‌ (కన్నూర్ స్క్వాడ్)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIFA Utsavam (@iifautsavam)