స్వప్న శాస్త్రం : కలలో ఇవి కనిపిస్తే అదృష్టం తలుపు తట్టినట్టే నట

కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. వచ్చే ప్రతి కల మనకు భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను ఇస్తుందని డ్రీమ్ సైన్స్ నమ్ముతుంది. ఈ కలలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని  స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని వస్తువులు  కనిపిస్తే  తలరాత మారిపోతుదంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు అలాంటి ఏవో తెలుసుకుందాం. . .

నిద్రలో కలలు కనడం సహజమైన ప్రక్రియ. కలలకు కాళ్లుండవు అన్నట్టు..ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి...ఇలలో ఊహించనివి కలలో జరిగిపోతుంటాయి. వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు. నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో మనసెక్కడ తిరుగుతుందో అదే కలగా కనిపిస్తుందంటారు. అందుకే ఇలలో సాధ్యం కాదు అనుకున్న విషయాలు చాలా కలలో జరుగుతుంటాయి. అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం.   అయితే చాలా కలలు మీ భవిష్యత్ కు సంకేతం అంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఈ కల మళ్లీ వస్తే బావుండును అనిపించేవి కొన్నైతే..అమ్మో ఇలాంటి కల మళ్లీ రాకూడదు అనిపించేవి కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా కలలో కొన్ని కనిపిస్తే మీ తలరాత మారిపోతుదంటారు స్వప్నశాస్త్ర నిపుణులు.

తామర పూలు: కలలో తామర పూలు కనిపిస్తే అది మీ తలరాత మారబోతోందనడానికి సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు. అప్పుల బాధలనుంచి విముక్తి కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి.

కలలో దేవతల దర్శనాలు: కలల శాస్త్రం ప్రకారం, మీకు కలలో దేవతలు కనిపిస్తే, రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతం. మీ ఆదాయ వనరులు పెరుగుతాయని మరియు మీకు అకస్మాత్తుగా డబ్బు లభిస్తుందని కూడా ఇది సూచిస్తుంది.

పండ్లతో నిండిన చెట్టు: కలల శాస్త్రం ప్రకారం, మీరు మీ కలలో పండ్లు లేదా అనేక చెట్లతో నిండిన చెట్టును చూస్తే, అది మీకు శుభసూచకం. ఈ కల మీరు రాబోయే భవిష్యత్తులో చాలా డబ్బుని పొందబోతున్నారని మరియు మీరు త్వరలో ధనవంతులు కావచ్చని సూచిస్తుంది.

నల్ల తేలును చూడటం: మీకు కలలో నల్ల తేలు కనిపిస్తే, అది మీకు శుభసూచకం. ఈ కల త్వరలో మీరు ఎక్కడి నుండైనా సంపదను పొందుతారని  అర్థం.

తేనెపట్టు: కలలో తేనెపట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి కల జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. వెంటాడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. 

పాలిస్తున్న ఆవు: ఆవు దగ్గర దూడ పాలుతాగడం కనిపిస్తే చాలా మంచి కలగా చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అకాస్మాత్తుగా ఆర్థిక లాభం ఉండొచ్చు. ఆస్తివివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు

చిలుక కనిపిస్తే: చిలుకలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు. ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని అర్థం. మీ జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని అంటారు.

పాలు తాగినట్లు కల వస్తే శుభసూచకం. ఈ కల అంటే మీరు కెరీర్ మరియు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందబోతున్నారని అర్థం. దీంతో పాటు ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, డబ్బు రాబోతున్నాయి.

చీమలు కలలో కనిపిస్తే: చీమలు సంపదను కూడబెట్టడంలో మేటి. అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది. త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం. 

గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే:  గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం.వ్యాపారులు లాభపడతారని సంకేతం. ఉద్యోగస్థులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలొస్తే ఓకే కానీ గుర్రంపైనుంచి పడుతున్నట్లు వస్తే కెరీర్ లో మీరు కూడా అలానే కిందకు దిగజారతారని అర్థం. 

కలలో బంగారు నాణేలు కనిపిస్తే: కలలో బంగారు నాణేలను చూడటం సూర్యుడికి సంబంధించినది. సూర్యుడు ఉత్సాహానికి సూచన. ఏదైనా పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సంతోషంగా ఉంటాలి. మీరు చేయబోయే పని మీకు మంచి ఫలితాలనిస్తుందని ఈ కల అర్థం.