Allu Arjun: నేను, నా ఫ్యాన్స్ తగ్గేదేలే.. ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 కొచ్చి(కేరళ) ఈవెంట్ బుధవారం నవంబర్ 25న గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తా అంటూ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్కి ప్రామిస్ చేశారు.

ఇటీవలే బీహార్ పాట్నాలో ఈవెంట్ జరిపి ట్రైలర్.. నిన్నటి చెన్నై ఈవెంట్లో సాంగ్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ ఇచ్చి అభిమానుల్లో అంచనాలు పెంచేశారు.

అల్లు అర్జున్ కి మాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే అక్కడ బన్నీని మల్లు అర్జున్ అంటూ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్కి మత్తెక్కించే న్యూస్ చెప్పారు. 

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "20 ఏళ్లుగా నాపై ఎంతో అభిమానాన్ని చూపిస్తూ వస్తున్న మలయాళ ఫ్యాన్స్కి స్పెషల్ థ్యాంక్స్ అంటూ మొదలుపెట్టారు. మలయాళ ప్రేక్షకులకు ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మూవీలో ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ మలయాళ లిరిక్స్ తోనే ప్రారంభమయ్యేలా సిద్దం చేసామని చెప్పి జోష్ పెంచారు. పుష్ప 2 లో నాకు.. ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ అందర్నీ విజిల్స్ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫహాద్ యాక్టింగ్ మలయాళ ఆడియన్స్ అంతా గర్వపడేలా ఉంటుంది.

Also Read : పుష్ప-2 సెన్సార్, రన్ టైమ్ వివరాలు.. వారు మాత్రం పేరెంట్స్తో కలిసి చూడాలి!

అలాగే పుష్ప 2 సినిమాతో  మూడేళ్ళుగా ప్రయాణం చేస్తున్న.. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్.. అందర్నీ తగ్గేదేలే అన్నట్టు నిలబెడుతోందని.. ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నా" అని అన్నారు.

ఇకపోతే అల్లు అర్జున్కి మలయాళంలో స్పెషల్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. బన్నీకి ఫేమ్ రాకముందు నుంచి.. ఆయన సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాయి. అంతేకాకుండా కేరళలో ఎలాంటి విపత్తులు సంభవించిన ముందుగా స్పందించేది కూడా బన్నీనే. దాంతో మలయాళంలో మల్లు అర్జున్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.

  • Beta
Beta feature