Aha Mythological Thriller: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

జబ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ 'అదిరే అభి'(Adhire Abhi).. డైరెక్ట‌ర్గా తన డెబ్యూ ఫిల్మ్తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే 'చిరంజీవ' (CHIRANJEEVA) పేరుతో టైటిల్ అనౌన్స్ చేసి  వీడియో రిలీజ్ చేశాడు. అయితే, ఈ థ్రిల్లర్ సిరీస్ లో హీరో ఎవరనేది సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ వచ్చాడు. ఇక తాజాగా సస్పెన్స్కి తెర దించుతూ హీరో ఎవరనేది వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు.

మైథలాజికల్ థ్రిల్లర్గా రానున్న ఈ సిరీస్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.  'చిరంజీవ' (CHIRANJEEVA) అంటూ వస్తోన్న ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకు ఓ రెండు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇవి ప్రేక్షకులకు థ్రిల్ కలిగేలా చేశాయి. అయితే, ఈ థ్రిల్లర్ సిరీస్ ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో జనవరి నెలలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మైథాలజీని జోడిస్తూ సరికొత్త కథలను చెప్పడం కొత్తగొచ్చే దర్శకులకు ఆనవాయితీగా మారింది. ఇక ఇపుడు 'అదిరే అభి' ఎలాంటి భిన్నమైన కాన్సెప్ట్తో వస్తున్నాడనేది ఆసక్తిగా మారింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్లో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ వాడటంతోపాటు విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారాని టాక్.

ఎ రాహుల్ యాదవ్ మరియు సుహాసిని రాహుల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్కు అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తోన్నాడు. త్వరలో ఈ చిరంజీవ వెబ్ సిరీస్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే ఎన్నో షోస్తో అలరించిన జబ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ 'అదిరే అభి'.. డైరెక్టర్గా ఎలాంటి కథతో వస్తున్నడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.