Kanguva: కంగువ కోసం సూర్య, బాబీ డియోల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. చాలా తక్కువే?

సూర్య హీరోగా శివ తెరకెక్కించినచిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈచిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ తారాగణం నటించింది. అయితే, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ఓ లుక్కేద్దాం. 

కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్గా స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య.. ఈ సినిమాకి రెమ్యునరేషన్ తక్కువే తీసుకున్నాడట. సూర్య ఈ సినిమా కోసం రూ.39 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే, సాధారణంగా హీరో సూర్య ఒక్కో సినిమాకు రూ.40- 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు.

ఇక డిఫరెంట్ షేడ్స్తో సూర్యకి ధీటుగా విలన్ క్యారెక్టర్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ రూ.5 కోట్లు అందుకున్నాడు.ఇక తన అందాలతో ఆడియన్స్కి ఫిదా చేసిన దిశా పటానీ రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. 

Also Read :  బాలకృష్ణ-బాబీ టైటిల్ టీజర్ చూశారా

ఇకపోతే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాలో వెయేళ్ల నాటి కథ తీసుకున్నప్పటికీ.. అందులో ఐదు వంశాలు చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో కన్‌ప్యూజ్ పెరిగిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాగ‌ర కోన‌, అర‌ణ్య‌కోన‌, ప్రణవ‌కోన‌, క‌పాల కోన‌, హిమ కోన వంశాలను సినిమాలో చూపించారు.

ఇందులో మూడు వంశాల్లోని వారు బిగ్గరగా అరవడం తప్పితే చేసిన యాక్టింగ్ ఏం లేదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాప్ టైర్ BGM, ఫేస్‌ఆఫ్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ మరియు VFX & విజువల్స్ టాప్ నాచ్ అని అంటున్నారు.

  • Beta
Beta feature
  • Beta
Beta feature