ఇది విన్నారా: ప్ర‌భాస్ కంటే ముందు సుడిగాలి సుధీర్ సినిమాలో ఇమాన్వీకి హీరోయిన్‌గా ఆఫ‌ర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కబోయే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది ఇమాన్వీ ఇస్మాయిల్(Imanvi Esmail). అంతేకాదు ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌లో ఆమె ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇమాన్ నటిగా, డ్యాన్సర్గా, యూట్యూబర్‌గా తన టాలెంట్ని నిరూపించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకుంది.

ఈ కొత్త బ్యూటీ ప్రభాస్కి జోడిగా నటిస్తుందనే విషయం తెలియడంతో ఈమే గ్రాఫ్ అమాంతం పెరిగింది. సోష‌ల్ మీడియా సెన్సేష‌న్గా మారడంతో ఆమె ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇమాన్వీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. 

సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీకి ప్రభాస్ సినిమా కంటే ముందు.. టాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశం వచ్చిందంట. అందులో సుడిగాలి సుధీర్ 'గోట్' మూవీ ఒక‌టి. కానీ, ఈ బ్యూటీ సుధీర్ సినిమాని రిజెక్ట్ చేసి ప్ర‌భాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. కాగా ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ ఫ్రెండ్‌, టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ గెట‌ప్ శ్రీను రివీల్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే  సుడిగాలి సుధీర్ గోట్ సినిమా హీరోయిన్ కోసం వెతికే క్రమంలో అతనికి ఇమాన్వీ ఇన్‌స్టాలో కంట పడిందట. దాంతో గోట్లో హీరోయిన్గా తనను తీసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసాడట సుధీర్. ఇక ప్రభాస్ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా సెలెక్ట్ అయినా న్యూస్ చూసి షాక్ అయ్యాడట. ఏదేమైనా ఇమాన్వీ చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా ఫిల్మ్. అందులో డార్లింగ్ ప్రభాస్తో. 

Also Read:-ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రభాస్తో..హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఈ సినిమాకి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది 1940లలో జరిగిన రజాకార్ల ఉద్యమం ఆధారంగా రూపొందించబడుతుంది. ఈ మూవీలో ప్రభాస్ స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు గాను ఇమాన్వీ రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్. 

ఎవరీ ఇమాన్ ఇస్మాయిల్?

అక్టోబరు 20, 1995న జన్మించిన ఇమాన్ కరాచీకి చెందిన ఒక పాకిస్తానీ సైనిక అధికారి కుమార్తె. ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన డ్యాన్సర్. తన డ్యాన్స్ షోస్ తో, డ్యాన్స్ రీల్స్‌ తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల మందికి పైగా  ఫాలోయర్స్ని కలిగి ఉంది. యూట్యూబర్‌గా ఇమాన్ నెలకు రూ.4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం.

28 ఏళ్ల ఇమాన్ ఇస్మాయిల్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అయిన‌ప్ప‌టికీ.. మూడు దేశాల పౌర‌స‌త్వం సంపాదించింది. సైకాలిజీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. నూయార్క్లో మాస్ట‌ర్స్‌ చ‌దివిన ఇమాన్.. సోష‌ల్ మీడియాలో ఇమాన్వీగా ప్ర‌సిద్ధి చెందింది. ఎలియాస్ ఖురేషీ డైరెక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్‌తో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. అదే ఆమె కెమెరా ముందు నటించిన మొదటి అనుభవం..మరియు ఫస్ట్ బ్రేక్. ఇక తొలి సినిమాతోనే ప్రభాస్తో అవకాశం రావడం..వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందడం కన్ఫమ్ అని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@imanvi1013)