కృత్రిమ మేధస్సుతో విద్యా పురోగతి

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)లో వేగవంతమైన పురోగతి  ప్రపంచవ్యాప్తంగా  ఉత్సుకత, ఆందోళన రెండింటిని రేకెత్తిస్తోంది. కృత్రిమ మేధ సాంకేతిక అభివృద్ధి చెందుతున్నప్పుడు, మానవ సామర్థ్యాలను అధిగమించి, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే దాని సామర్థ్యాల గురించిన చర్యలు ప్రధానమైనవిగా మారుతున్నాయి.

విద్యలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక హాట్ టాపిక్​గా మారింది. అనేక పాఠశాలలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నాయి. స్మార్ట్ పరికరాలు, వెబ్ ఆధారిత పాఠ్యాంశాల లభ్యత పెరిగిన కారణంగా కృత్రిమ మేధ ప్రస్తుత వినియోగం గతంలో కంటే ఎక్కువగా ఉంది.  కృత్రిమ మేధలో ఉన్న కొన్ని సాంకేతికతలు ఇప్పటికే విద్యను అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. 

విద్యార్థులు సులభంగా త్వరగా ఉపయోగించగల ‘విద్యా ఆప్’లకు ‘చాట్ బోట్స్’  ఒక ఉదాహరణ. పిల్లలు గణితం లేదా పఠనాశక్తి వంటి నిర్దిష్ట అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు రూపొందించిన ‘బోట్స్’తో ‘చాట్’ చేయడానికి ఐపాడ్​లను ఉపయోగించే తరగతి గదులలో ఇవి ఎక్కువగా అమలు చేస్తున్నారు. చాట్ బోట్స్ ట్యూటర్లు కొత్త భావనలను (concepts) నేర్చుకోవడంలో విద్యార్థులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు విశ్లేషించడం కూడా చేస్తుంది. చాట్ బోట్స్ అన్నిసాంకేతిక మూలాల భవిష్యత్తు.  ఇది ఉపాధ్యాయులకు కేటాయించిన పనుల ఒత్తిడిని తగ్గిస్తుంది. తరగతి గదుల్లో ఉపయోగించే చాట్ బోట్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఈమెయిల్ కమ్యూనికేషన్​ను కూడా చేయగలవు. 

అభ్యసన యాజమాన్య విధానాలు  

లెర్నింగ్ మేనేజ్​మెంట్ సిస్టమ్స్ అనేవి పాఠశాల అన్ని ఆన్​లైన్ కార్యకలాపాలను నిర్వహించడానికి కేంద్రీకృత, సహజమైన వ్యవస్థను అందిస్తుంది. ఈ సాధనాలను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నా ఎక్కువగా అసైన్​మెంట్లు, విద్యార్థులు తల్లిదండ్రులతో వివిధ విషయాలను కమ్యూనికేట్ చేయడం, విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం, విద్యార్థుల పనితీరుపై నివేదికలను రూపొందించడంతోపాటు పాఠ్యాంశాలు, అసైన్​మెంట్లు, గ్రేడుల వరకు కోర్సు అన్ని అంశాలను ఒకే స్థలంలో ఉంచడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. ఉపాధ్యాయులు ఏదైనా ఒక అసైన్​మెంట్​పై తన అభిప్రాయాన్ని సులభంగా విద్యార్థులకు అందించగలరు.

రోబోటిక్స్

విద్యలో గతకొన్ని సంవత్సరాలుగా కృత్రిమమేధతో కూడిన రోబోటిక్స్ వినియోగం పెరిగింది. ఈ రోబోటిక్స్ ని ఇప్పుడు మనం విద్యా బోధన అభ్యసన కార్యక్రమంలో వినియోగిస్తున్నాం. ఇది విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ప్రస్తుతం విద్యలో రోబోటిక్స్ వినియోగం అనివార్యం అవుతుంది. విద్యా అభ్యసనలో, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్చుకునేందుకు రోబోటిక్స్ అద్భుతమైన వనరుగా పనిచేస్తుంది. విసుగు చెందకుండా ఒక అంశాన్ని లోతుగా అన్వేషించడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. వివిధ రకాల అభ్యాసకులకు అవసరమైన నూతన బోధన మార్గాలతో బోధన అభ్యసనను గావించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

రోబోటిక్స్ విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి. తరగతిలో తోటి విద్యార్థులతో ఎలాంటి ఒత్తిడి లేకుండా తమకు తాము కొత్తగా ఏదైనా విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రయత్నాల ఫలితాన్ని స్వయంగా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఈ విధంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పుడు, నిస్సందేహంగా ప్రజల జీవితాలలో ఇది ముఖ్యమైన పాత్ర  పోషిస్తుంది.  సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒక సవాలు. చాలా సందర్భాలలో ఉపాధ్యాయులు తరగతి గదులలో కొత్త సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ పొందుతారు. 

వివాదాస్పద అంశం

విద్యలో కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఒక వివాదాస్పద అంశం. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలా వద్దా, ఉపాధ్యాయుని ప్రాముఖ్యతను తగ్గిస్తుందని కొంతమంది వాదిస్తున్నారు. అయితే కృత్రిమ మేధతో విద్యలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కృత్రిమ మేధ మానవుని కంటే చాలా వేగంగా వ్యాసాలను, పరిశోధనా పత్రాలను మదింపు చేయగలదు. ఇది విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, నైపుణ్యాలను పెంపొందిస్తుంది. మరింత అభ్యసనం అవసరమయ్యే విద్యార్థులకు కృత్రిమ మేధ అలసిపోకుండా వివిధ అభ్యసన శైలుల ద్వారా నిర్దిష్ట అంశాలను వివిధ నైపుణ్యాలతో సులభంగా బోధించడం 
జరుగుతుంది.

సులభంగా పర్యవేక్షణ

కృత్రిమ మేధ పిల్లల సామాజిక జీవితం గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందే తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరుస్తుంది.  కృత్రిమ మేధ సాంకేతికత వారి పిల్లల పరస్పర చర్యను ఆన్​లైన్​లో గతం కంటే మరింత దగ్గరగా పర్యవేక్షించడానికి  అనుమతిస్తుంది. పాఠశాలలు,విద్యార్థులు, వివిధ పాఠ్యాంశాలను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో విశ్లేషించే సాఫ్ట్​వేర్లను ఉపయోగిస్తున్నాయి. తద్వారా విద్యార్థులకు అవసరమయ్యే బోధన విధానాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.  హోంవర్క్, క్విజ్ మొదలైన వాటి ద్వారా విద్యార్థులను వారి లక్ష్యాల వైపు నడిపించే విద్యాసాధనంగా కృత్రిమమేధను ఉపయోగించవచ్చు. కృత్రిమ మేధ ఆటోమేషన్ ద్వారా చిన్నచిన్న పనులు చేసుకోవచ్చు.ఈమెయిల్ నిర్వహించడం ద్వారా వంటి ప్రాపంచిక కార్యకలాపాలను చేయడంలో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. 

వర్చువల్ రియాలిటీ

విద్యలో ఇటీవలి ఆవిష్కరణ ‘వర్చువల్ రియాలిటీ’. ఇది చరిత్రను బోధించడం నుంచి గణిత నైపుణ్యాలతో విద్యార్థులకు సహాయం చేయడం వరకు ప్రతి దానికి ఉపయోగిస్తున్నారు. వర్చువల్ రియాలిటీ అనేది త్రిమితీయ కంప్యూటర్ సృష్టించిన పర్యావరణం. ఈ అధ్యాపకులు వారి తరగతి గదులలో అనుభవ పూర్వక అభ్యాసాన్ని ఏకీకృతం చేయడానికి నూతన మార్గాలను కనుగొంటారు. వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్​ని ఉపయోగించి విద్యార్థులు ఒకరినొకరు కనెక్ట్ అయి సురక్షితంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. వర్చువల్ రియాలిటీతో విద్యార్థులు నిజ జీవిత సంఘటనలను చూడడానికి లేదా వివిధ విషయాలను, నేర్చుకునే అవకాశం లేని విషయాలను అన్వేషించవచ్చు. ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులకు బోధించడానికి మరింత ఆకర్షణీయమైన మార్గాలను దీని ద్వారా కనుగొనగలరు. 

లెర్నింగ్ మేనేజ్​మెంట్​ సిస్టం

కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగే లెర్నింగ్ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ను కూడా నిర్మించవచ్చు. కంటెంట్​ను రూపొందించడంలో, సిస్టమ్​లో వారి పిల్లల పురోగతిని పర్యవేక్షించడంలో, తల్లిదండ్రులకు ఇది సహాయపడుతుంది. అలాగే విద్యార్థులను అంచనా వేయడం, మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడే అభ్యసనా యాజమాన్య విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.  ఇవి ఉపాధ్యాయులకు, తరగతి గది నిర్వహణ సమయాన్నితగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. తల్లిదండ్రులకు వారి పిల్లల పురోగతిని బాగా అర్థం చేసుకోవడంలో, ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ లెర్నింగ్ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒక అమూల్యమైన సాధనంగా చెప్పవచ్చు.

ప్రతికూలత

రోబోటిక్స్ మానవుని వలె ఒక మంచి ఉపాధ్యాయుడు కాకపోవచ్చు. విద్యలో కృత్రిమ మేధ ప్రతికూలత ఏమిటంటే, బోధనలో సాంకేతికత ఎల్లప్పుడూ విజయవంతం కాకపోవచ్చు. ఇది భావోద్వేగాలను అనుభవించదు. విద్యార్థులు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు లేదా ప్రశ్నిస్తున్నప్పుడు కృత్రిమ మేధ నుంచి సరియైన సమయంలో ప్రతిస్పందన రాకపోవచ్చు. కృత్రిమ మేధ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో అధ్యయనం జరుగుతోంది. మన జీవితాలను మెరుగుపరిచే కృత్రిమ మేధ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో అనేకమంది పరిశోధకులు పనిచేస్తున్నారు. 

కీలక సాధనం

విద్యలో మార్పు కోసం కృత్రిమ మేధ ఒక కీలకమైన సాధనం.  పిల్లలందరూ ఒకే వేగంతో నేర్చుకోరు లేదా ఒకే విధమైన నైపుణ్యాలను కలిగి ఉండరు.  అలాంటి అభ్యాసకులు అందరికీ ఇది ఒక ముఖ్యమైన సాధనం. సమాజ అభివృద్ధి కోసం కృత్రిమ మేధ సామర్థ్యాన్ని ఉపయోగించడంలో బాధ్యతాయుతమైన అభివృద్ధి, నైతిక మార్గదర్శకాలు, మానవ పర్యవేక్షణ చాలా ముఖ్యమైనవి.  ఏదేమైనప్పటికీ, కృత్రిమ మేధ సహాయంతో విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోనే అవకాశం ఉంది. 

- డా. చిందం రవీందర్,