విజనరీ లీడర్.. సీఎం రేవంత్ రెడ్డి

ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ పరుగు తీస్తుందా..? తొలి పదేండ్లలో రాష్ట్రంలో విధ్వంసమైన  రంగాలనుచక్కదిద్ది తెలంగాణను అంతస్థాయికి తీసుకెళ్లటం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కానీ, సమర్థమైన నాయకత్వం..దూరదృష్టి.. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడుంటే.. ఆ లక్ష్యాన్ని చేరువవటం ఎంతో దూరంలో లేదని ప్రజా ప్రభుత్వం నిరూపించింది. పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ. 83 లక్షల కోట్ల జీఎస్డీపీ) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనేది  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పం. అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే అటు దిశగా ఆశించిన లక్ష్యానికి అనుగుణమైన ప్రణాళిక, అంతకు మించిన ముందుచూపుతో అడుగులేస్తున్నారు.

తెలంగాణను మూడు వలయాలుగా విభజించి.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ ఏరియా, అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ ఏరియాగా, రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ వ్యవసాయిక తెలంగాణగా అభివృద్ధి చేసే ప్రణాళికల తయారీకి సీఎం రేవంత్ రెడ్డి తొలి సమీక్ష నుంచే పట్టుదలతో వ్యవహరించారు. ఏ రాష్ట్రమైనా ఆర్థిక వృద్ధి సాధించాలంటే వ్యవసాయ, పారిశ్రామిక తయారీ రంగాలతో పాటు సేవా రంగమే ప్రామాణికం. రాష్ట్రాన్ని మూడు వలయాలుగా విభజించి అటు వ్యవసాయంతో పాటు, తయారీ రంగాన్ని, ఉపాధి కల్పించే సేవల రంగాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి ఎంచుకున్న మూడంచెల విధానం ఆర్థిక నిపుణులకు సైతం కొత్త మార్గం చూపించింది.

పదేండ్లలో తను కలలు కనే తెలంగాణను ఆవిష్కరించాలనే లక్ష్యానికి అనుగుణంగానే పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన దిశగా నైపుణ్యాల వృద్ధి, ప్రపంచాన్ని ఆకర్షించేలా హైదరాబాద్ లో  ఫ్యూచర్ సిటీ, వీటన్నింటికీ తోడుగా రైతును రాజును చేసే బృహత్తర కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2024.. ఒక్క ఏడాదిలోనే  తెలంగాణ ఎన్నో మైలు రాళ్లు దాటింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. అనుసరించిన విధానాలతో వివిధ రంగాల్లో తెలంగాణ సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

2024–25 ఆర్థిక వృద్ధి అంచనాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణంతో అన్ని రాష్ట్రాల కంటే మేటిగా నిలిచింది. పదేండ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా చేసిన పాలకుల తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఆర్థిక సుస్థిరతకు బాటలు వేసింది. అటు వృద్ది రేటుతో పాటు తలసరి ఆదాయంలోనూ తెలంగాణ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకుంది. 

ట్రిలియన్​ డాలర్లకు చేరనుంది

తెలంగాణ  స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ) 2036 నాటికి ట్రిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరుతుందని వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనా వేసింది. ప్రస్తుతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీ 176 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లుగా (రూపాయల్లో 15 లక్షల కోట్లు) ఉందని.. వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని తాజా నివేదికల్లో వెల్లడించింది. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 4.9% ఉండగా.. అది 2032 నాటికి 7.73 శాతానికి, 2036 నాటికి 9.3 శాతానికి చేరుకుంటుంది. 140 కోట్ల దేశ జనాభాలో కేవలం 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ అద్వితీయంగా పురోగమిస్తోంది. 

పెరిగిన వృద్ధిరేటు

జీఎస్డీపీ వృద్ధి రేటులో తెలంగాణ గణనీయ ప్రగతిని నమోదు చేసింది. జాతీయ స్థాయిని మించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం జీఎస్డీపీ  9.2 శాతం. జాతీయ జీడీపీ 8.2% ఉండగా.. అంతకు మించిన వృద్ధిని తెలంగాణ అందుకుంది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఇటీవలే ఈ అంచనాలను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే తెలంగాణ వృద్ధిరేటు 0.2 శాతం తక్కువ. 

కానీ 2024–25 తొలి అయిదు నెలల్లో జాతీయ వృద్ధి రేటు ఒక శాతం ఎక్కువ నమోదు చేసింది. గతేడాది 8.8 శాతం ఉన్న వృద్ధి రేటు తాజా అంచనాల్లో 9.2 శాతానికి చేరింది. వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు  పారిశ్రామిక రంగం, తయారీ, సేవా రంగాలన్నింటా తెలంగాణ మంచి పనితీరు కనబర్చింది. రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించటంలోనూ తెలంగాణ దేశమందరి దృష్టిని ఆకర్షించింది. 

తలసరి ఆదాయం 4 లక్షలకు చేరువగా..

తలసరి ఆదాయం ఇంచుమించుగా జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలకు చేరువైంది. ప్రధానమంత్రి ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తాజా అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.83 లక్షలుగా నమోదైంది. గోవా, ఢిల్లీ రెండు రాష్ట్రాలు మన కంటే ముందున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే 193.6 శాతం నమోదైంది. 

తగ్గిన నిరుద్యోగ రేటు శాతం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల్లో అత్యంత కీలకమైన నిరుద్యోగ సమస్య ఈ ఏడాదిలో తగ్గుముఖం పట్టింది. గత ఏడాది 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే..  2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది. జాతీయ స్థాయిలో కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన  లేబర్ ఫోర్స్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో 53,145 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పెరగటమే అందుకు ప్రధాన కారణం. 

ధరల పెరుగుదల తెలంగాణలోనే తక్కువ

ఆకాశాన్ని అంటేలా పెరుగుతూ వచ్చిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు ఈ ఏడాదిలో కొంచెం కళ్లెం పడింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువగా 4.24 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. 2023 నవంబరుతో 2024 నవంబరులోని ధరలు పెరిగిన తీరును విశ్లేషిస్తూ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ‘వినియోగదారుల ధరల సూచిక’ (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ఇటీవలే విడుదల చేసింది. ఆహార ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, పెట్రోలు, డీజిల్, దుస్తులు, ఇళ్లు తదితర సరుకుల ధరలను వివిధ రాష్ట్రాల మార్కెట్ల నుంచి సేకరించి సీపీఐని రూపొందిస్తారు.

ఈ ఏడాదిలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యల్పంగా తెలంగాణలో 4.24% ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ సగటు 5.48% ఉంటే..  తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 3.73 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.88 శాతం నమోదవటం గమనార్హం. నిరుటితో పోలిస్తే ద్రవ్యోల్బణం శాతం తగ్గడం ఆశావాహ పరిణామం. ద్రవ్యోల్బణ రేటులో అత్యధికంగా ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.39%, బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7.55%, ఒడిశా 6.78 శాతంతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

రైతు ఖాతాలలో 30వేల కోట్లు జమ

డిసెంబర్​లో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన వెంటనే పెండింగ్​లో  ఉన్న రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. జులై, ఆగస్ట్ నెలల్లో  రూ.2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేసింది. ఈ రెండు స్కీంలతో దాదాపు రూ.30 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ నిధులన్నీ రైతులకు భరోసానివ్వటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  సంపన్నం చేశాయి. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలకు వడ్డీ మాఫీ నిధులు ఎగవేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు, మహిళలు తమంతట తాముగా  ఆర్థికంగా నిలదొక్కుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. 

రికార్డులు నెలకొల్పడం తెలంగాణకు కొత్తేమీ కాదు. ధాన్యం  ఉత్పత్తిలో, రుణమాఫీలో, జీఎస్ డీపీలో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ 2024లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అటు భౌగోళికంగా,  ఇటు రాజకీయంగా దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు అనువైన వాతావరణం, అనుకూల పర్యావరణం ఉంది. ఈ అనుకూలతలను ఆసరాగా చేసుకుని భవిష్యత్ లో మరెన్నో రికార్డులు నెలకొల్పేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది.

33శాతం ఎఫ్​డీఐల వృద్ధి 

తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆరు నెలల్లో రాష్ట్రానికి రూ.12,864 కోట్లు వచ్చాయి. 2023 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య రూ.9,679 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే రూ.3,185 కోట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 33 శాతం ఎఫ్​డీఐల వృద్ధి నమోదైంది.

కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఆరు నెలల పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐల్లో హైదరాబాద్​లో రూ.11970 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.680.5 కోట్లు, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రూ.116.7 కోట్లు, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 96.99 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 

రికార్డు స్థాయిలో వ్యవసాయ సాగు

దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసిన రికార్డును తెలంగాణ ఈ ఏడాదిలోనే నమోదు చేసింది. గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 1.68 కోట్ల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలి సీజన్​లోనే అద్భుతమైన ఫలితాన్ని అందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నరకాల వరి సాగు అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వం రూ.1100 కోట్ల బోనస్ చెల్లించటంతో నాలుగు లక్షల మంది రైతులకు అదనపు ఆదాయం లభించింది. 

రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల 

రుణమాఫీ చేయటం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఒక్క ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు రైతుల  ఖాతాల్లో జమ చేయటంతో 28 లక్షల మంది రైతులు రుణ విముక్తులయ్యారు.వీటన్నింటి కలబోతతో వ్యవసాయం వర్ధిల్లింది. 

ఒన్​ నేషన్, ఒన్ ఎలక్షన్​ బిల్లు అమలులోకివస్తే అది ఒన్​ పార్టీ.. ఒన్​ ఎలక్షన్​కి దారితీస్తుంది. ఆ తర్వాత ఒన్​ లీడర్.. ఒన్​ ఎలక్షన్​అమలుచేస్తారు. కాబట్టి, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లును వ్యతిరేకించాలి.
- సంజయ్​ రౌత్,శివసేన (యూబీటీ) నేత

సోషల్ మీడియాను ఈ రోజుల్లో కొత్త మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నారు. మేం డ్రగ్స్​ వ్యాపారులపై చర్యలు తీసుకున్నప్పుడు వారు డ్రగ్​ పెడ్లింగ్​ కోసం సోషల్​ మీడియా, కొరియర్​ సేవలను ఉపయోగిస్తున్నారు. కానీ, మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం  అప్రమత్తమై వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. దేవేంద్ర ఫడ్నవీస్,మహారాష్ట్ర సీఎంఢిల్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్​కేజ్రీవాల్​ తన సొంత ఈక్వేషన్స్​ తయారు చేసుకుంటున్నారు. కాంగ్రెస్,బీజేపీ కలిసి పోరాటం చేస్తున్నాయని కేజ్రీవాల్​ అంటున్నారు. కానీ, అది అసాధ్యమని ఆయనకు బాగా తెలుసు. - అశోక్ గెహ్లాట్, రాజస్తాన్ మాజీ సీఎం

- బొల్గం శ్రీనివాస్, సీఎం పీఆర్​వో