తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఉద్యోగాలు చేస్తున్న వికలాంగులకు  కౌన్సిలింగ్​లో మొదటి ప్రాధాన్యత కల్పించాలి. వారికి అనుకూలమైన ప్రదేశాలలో నియమించాలి. రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలలో వీరిని నియమించాలి. వారు నివసిస్తున్న ప్రాంతానికి, వారు డ్యూటీ చేసే ప్రాంతానికి అతి దగ్గరగా ఉండే ప్రాంతాలను నిర్ణయించాలి.

 ప్రమోషన్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి. వికలాంగులైన ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. వీరికి ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వికలాంగుల అలవెన్స్ కల్పించాలి. విధి నిర్వహణలో వికలాంగులకు కొన్ని సందర్భాలలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి.

రాపాక రవీందర్, జనగాం