Rajamouli Suriya: నాకు ఇన్‌స్పిరేషన్‌ సూర్యనే.. మీతో సినిమా తీసే ఛాన్స్‌ మిస్‌ అయ్యా: డైరెక్టర్ రాజమౌళి

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో వస్తున్నాడు. శివ (Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

కంగువ నవంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్."కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (నవంబర్ 7న) సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్ లో నిర్వహించారు.ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళితోపాటు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. "తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా నేను ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే నాకు స్ఫూర్తి. చాలా సవంత్సరాలు.. ‘గజిని’ రిలీజ్ టైంలో సూర్య తెలుగు ఇండస్ట్రీ అభిమానుల వరకు సినిమాని ఎలా తీసుకురాగలిగాడో, ఆ విధానాన్ని కేస్‌స్టడీగా కింద తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పేవాడినని.. అలా మనం కూడా వేరే భాషల వరకు వెళ్ళాలని గుర్తుచేసుకున్నాడు.

నా పాన్‌ ఇండియా మూవీ ‘బాహుబలి’ సినిమాకు సూర్య నా మొదటి ఇన్‌స్పిరేషన్‌. మేం కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ, కుదర్లేదు. ‘నేను అవకాశం మిస్‌ అయ్యా’ అంటూ సూర్య నా గురించి ఓ ఈవెంట్‌లో అన్నారు. ఆయన మిస్‌ అవడం కాదు.. నేనే ఛాన్స్‌ మిస్‌ అయ్యా" అని తెలిపారు. మీ యాక్టింగ్, మీ డెడికేషన్, మీ కష్టపడే తత్వాన్ని ఎంతో ప్రేమిస్తా... ఎప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవస్తా అని వేదికగా అభిమానులతో పంచుకున్నారు.