AnushkaShetty: అనుష్క శెట్టి బర్త్డే స్పెషల్.. అంచనాలు పెంచేస్తోన్న క్రిష్ ‘ఘాటి’ మూవీ అప్డేట్

విభిన్న సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(AnushkaShetty)తో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు తనదైన శైలిలో '‘ఘాటి' (GAATI) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమాపై అందరి అటెన్షన్ క్రియేట్ చేసారు. ఘాటీ అనగా లోయ అని అర్ధం.

ఇవాళ గురువారం (నవంబర్ 7న) ది క్వీన్ అనుష్క శెట్టి బర్త్డే స్పెషల్గా 'ఘాటి' నుంచి పోస్టర్ రిలీజ్ చేసారు. " బాధితుడు (VICTIM),  నేరస్థుడు (CRIMINAL), లెజెండ్ (LEGEND).. రాణి ఇప్పుడు ఘాటిని పరిపాలిస్తుంది.. 'ది క్వీన్' అనుష్కశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ మేకర్స్ తెలిపారు.

ALSO READ : మట్కా నుంచి రామా టాకీస్ రోడ్డు మీద.. సాంగ్ రిలీజ్

అలాగే 'ఘాటి' నుంచి ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. కాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. చేతికి రక్తం అంటిన మరకలతో అనుష్క బీడీ తాగుతూ.. గంభీరమైన కోపోద్వేషంతో రగిలిపోయే ఈ పోస్టర్ అంచనాలు పెంచేస్తోంది.  

అనుష్క..ప్రస్తుతం ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. రీసెంట్గా స్వీటీ మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా అనుష్క కెరీర్ లోనే పూర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుందని పోస్టర్ చూస్తే తెలుస్తుంది. 'ఘాటి' సినిమాను ప్రముఖ టాప్ ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్లో నిర్మిస్తోంది.