Pushpa2TheRuleReview: బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం.. డైరెక్టర్ హరీష్ శంకర్ పుష్ప 2 రివ్యూ

పుష్ప 2 ది రూల్ నేడు డిసెంబర్ 5న బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ స్వాగ్, సుకుమార్ మేకింగ్ స్టైల్.. ఒక్కటేంటీ? ఎలివేషన్, ఎమోషన్స్ ఇలా చాలానే ఉన్నాయి. దాంతో  బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసే పనిలో ఉంది. ఇక సినిమా చూసిన ఫ్యాన్స్, సినీ మేకర్స్.. పుష్ప రాజ్ యాక్టింగ్ కి ఫిదా అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చేసాడు. " అల్లుఅర్జున్ మరియు సుకుమార్!.. నమ్మశక్యం కాని ఘనతను సాధించారు. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, సీఎం ఫోటో సీన్, జటాహారా... ఇలా ప్రతిదీ నాన్‌స్టాప్ గూస్‌బంప్ మూమెంట్స్.. థియేటర్లలో ఇలాంటి అనుభవాలు చాలా అరుదు. బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం" అంటూ హరీష్ చెప్పుకొచ్చారు.

Also Read : నా భార్యను కోల్పోవడం తట్టులేకపోతున్నా

ఇకపోతే ఈ మూవీ ఓపెనింగ్ డే రోజున సుమారుగా రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.