Unstoppable: నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు లేడు.. దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’. ఇటీవలే సీజన్ 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే, సీజన్ 4 లో ఏపీ సీఎం చంద్రబాబు, లక్కీ భాస్కర్ మూవీ టీమ్, కంగువ సూర్య వచ్చి ఆడియన్స్ను ఎంటర్ టైన్ చేశారు.

ఈ వారం లేటెస్ట్ ఎపిసోడ్ 4 కి చీఫ్ గెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్హున్ (Allu Arjun) వచ్చి సందడి చేశారు. 'ఇద్దరూ ఫైరే' పేరుతో ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ నేడు శుక్రవారం (నవంబర్ 15) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ షోలో బాలకృష్ణ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకి.. అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ ప్రేక్షకుల్ని తెగ ఖుషి చేశారు. 

"నేషనల్ అవార్డు రాగానే నీకు ఎలా అనిపించింది?" అని బాలయ్య ప్రశ్నించగా.. అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. " ఇప్పటివరకు బెస్ట్ యాక్టర్ కింద.. నేషనల్ అవార్డు ఎవరెవరికి వచ్చిందా? అని చెక్ చేస్తే.. ఒక్క తెలుగు పేరు కూడా నాకు కనిపించలేదు. అది నా మనసులో అలానే ఉండిపోయింది. దాంతో ఆ నేషనల్ అవార్డ్ పేరుని రౌండప్ చేసి.. దీన్ని నేను కొట్టాలి" అని ఫిక్స్ అయినట్లు అల్లు అర్జున్ చెప్పారు. 

'తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్, మహేశ్ బాబులలో నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు?' అని బాలయ్య ప్రశ్నించగా, అల్లు అర్జున్ తెలివిగా సమాధానమిచ్చారు. ''నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే, అది రేపటి నేనే'' అంటూ 'పుష్ప 1' సినిమాలోని 'హే బిడ్డా ఇది నా అడ్డా' సాంగ్ లోని లిరిక్స్ని జవాబుగా చెప్పి.. తనకు తానే బిగ్గెస్ట్ కాంపిటీషన్ అన్నట్లు అల్లు అర్జున్ చెప్పడంతో ఫ్యాన్స్ విజిల్స్ వేశారు.

అలాగే 'బాలీవుడ్లో ఈ జెనరేషన్ లోనే ఫైనెస్ట్ యాక్టర్స్లో రణబీర్ కపూర్ ఒకరు. ఆయన నా పర్సనల్ ఫేవరేట్ యాక్టర్. నాకు అతనంటే చాలా ఇష్టం' అని బన్నీ చెప్పారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఈ షోలో చాలా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న 'ఇద్దరూ ఫైరే' అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ 4 చూసేయండి.