Anupam Kher: కార్తికేయ2లో ఉన్న ఈ నటుడు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నడు.. అదేంటని అడిగితే..

బాలీవుడ్‌‌‌‌లోని గ్రేట్ ఆర్టిస్టుల్లో అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఒకరు. ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ మూవీస్ చూశాక దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆయనకు అభిమానులైపోయారు. అలాంటి అనుపమ్ ఖేర్.. '40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా.. ఆయన ఇప్పటికీ అద్దె ఇంట్లోనే' ఉంటున్నానని చెప్పడం ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ఉన్నంతలో ఆనందంగా ఉండటం.. సంపాదించినా ప్రతి పైసాలో సమాజానికి కొంత ఇవ్వడమే తనకు సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఖేర్ మాటల్లోనే.. 

"ఈ 69 ఏళ్ల వయసులో ఎప్పుడు సొంతంగా ఇంటిని కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నా..అయినా ఎవరి కోసం ఒక ఇంటిని కొనుగోలు చేయాలి? ఆ ఇంటికి పెట్టే డబ్బును బ్యాంకులో దాచుకుని ప్రతినెలా అద్దె కట్టుకుంటే బాగుంటుంది కదా అనేది నా భావన. భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావచ్చు. అందువల్ల, ఆస్తుల కొనుగోలుకు వెచ్చించే డబ్బును దాచిపెట్టి.. దానినే సమానంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు దాదాపు 550 చిత్రాలలో నటించిన ఖేర్, ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి బదులుగా డబ్బు ఆదా చేయడం మరియు అద్దె చెల్లించడంపై తనకు నమ్మకం ఉందని చెప్పడంతో పాటు ఇంటిని ఎవరి కోసం కొనాలి అని ప్రశ్నించడం ఎంతోమందిని ఆలోచింపజేస్తుంది.

ALSO READ | Pushpa2TheRuleTrailer: కౌంట్ డౌన్ స్టార్ట్.. పుష్ప 2 ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

అయితే.. ఖేర్ తన తల్లి కోరిక మేరకు సిమ్లాలో ఒక ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. ఖేర్ వాళ్ళ అమ్మ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అడగగా..  ఏకంగా ఎనిమిది పడక గదులున్న ఇంటిని బహుమతిగా ఇచ్చానని.. ఇపుడు అక్కడ ఉండట్లేదని ఖేర్ చెప్పుకొచ్చారు.

అయితే..అనుపమ్ ఖేర్కి ఇంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఇలాంటి భావాలూ ఉండటం పట్ల రతన్‌టాటా స్ఫూర్తి ఉందని తెలియజేశారు. ది గ్రేట్ రతన్‌ టాటాకు ఎంతో ఆస్తి ఉన్నా.. చాలా సింపుల్‌గా జీవించేవారని.. నివసించడానికి చిన్న ఇల్లు, ప్రయాణించడానికి చిన్న కారు మాత్రమే ఆయనకు ఉండేవని.. అలా ఆయన్ని చూసే ఆవిధంగా ఉండాలని నిర్ణయించుకున్నానని" అనుపమ్ ఖేర్ వెల్లడించారు. 

అనుపమ్ ఖేర్..1987లో విక్టరీ వెంకటేష్ నటించిన ‘త్రిమూర్తులు’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్ ‘కార్తికేయ 2’ శ్రీ కృష్ణుడి గొప్పతనం చెప్పే సీన్స్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజతో టైగర్ నాగేశ్వరరావు మూవీలో నటించి మెప్పించాడు. ఈ ఏడాది (2024 లో) బాలీవుడ్ లో ‘కాగజ్‌ 2’, ‘ది సిగ్నేచర్‌ వంటి మూవీస్ తో వచ్చి అలరించాడు.

ఇక ఇపుడు లేటెస్ట్ 'విజయ్ 69' మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 2016 లో అనుపమ్ ఖేర్కి భారత ప్రభుత్వము పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది.