ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను (Allu Arjun) ప్రశంసించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). తాను అల్లు అర్జున్కి వీరాభిమానిని కొనియాడారు. ఇటీవలే పుష్ప 2 ది ప్రమోషన్స్లో భాగంగా ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ అంటే తనకెంతో ఇష్టమని, ఆయన ఎన్నో ఏండ్లుగా ఇండస్ట్రీలో స్టార్గా ఉన్నారని.. అతనే ఇండియాకి రియల్ మెగాస్టార్ అని అల్లు అర్జున్ అన్నారు.
అలాగే 'బిగ్ బీ చాలామంది నటి నటులకు స్ఫూర్తి అని.. నేను చిన్నప్పటి నుంచి అమితాబ్ గారి సినిమాలు చూస్తూ పెరిగానని' బన్నీ తెలిపారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో కాస్తా ఆలస్యంగా అమితాబ్ సోమవారం (డిసెంబర్ 9) ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు.
Also Read:-సోమవారం (Dec 9న) తగ్గిన పుష్ప2 టికెట్ ధరలు.. ఏ థియేటర్‌లో ఎంతంటే?
అల్లు అర్జున్ మాట్లాడిన వీడియోని అమితాబ్ షేర్ చేస్తూ.. "అల్లు అర్జున్ జీ.. మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నా గురించి మీరు కాస్త ఎక్కువే చెప్పారు. మీ నటన, టాలెంట్ కు మేమందరం కూడా వీరాభిమానులం.. మీరు కూడా అందరినీ ఇలాగే ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి.. మీరు మరింత సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు.
దాంతో మరోసారి బన్నీ రెస్సాన్స్ అవుతూ "అమితాబ్ జీ.. మీరు మా సూపర్ హీరో.. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. మీ ఈ అభిమానానికి, ప్రశంసలకు రుణపడి ఉంటాను.. మీ వినయంతో నన్ను కట్టిపడేశారు" అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అమితాబ్ ట్వీట్స్ కి ఐకాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఖుషి అవుతున్నారు.
— Allu Arjun (@alluarjun) December 9, 2024