అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 (Pushpa2) నేడు (డిసెంబర్ 5న) గ్రాండ్గా రిలీజయింది. సినిమాకి వచ్చే పాజిటివ్ రివ్యూలతో ఐకాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అల్లు అర్జున్ నటన విశ్వరూపంలా ఉందంటూ కాలర్ ఎగరేస్తున్నారు. అయితే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ మాత్రం.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇపుడు పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో సందర్భాన్ని వచ్చే డైలాగ్స్ కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినవిగా కొందరు రచ్చలేపుతున్నారు.
ఫస్ట్ హాఫ్ ఓ సీన్‌లో అల్లు అర్జున్ డైలాగ్ చెబుతూ..'ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్' , అలాగే 'స్నేహితుడి కోసం వస్తా... నువ్వు నీ బాపు ఆపలేరు' అనే ఈ డైలాగ్స్ సినిమాలో లేవు. కానీ ఇవి సినిమాలో ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో కేశవకోసం పుష్ప రాజ్ చెప్పే డైలాగ్ అంటూ ఒకటి వైరల్ అవుతోంది. 'కేశవ నా స్నేహితుడు. నా స్నేహితుడి కోసం నేను వస్తాను దానికి అడ్డు నువ్వు వచ్చిన నీ బాబు వచ్చినా మీ బాబాయ్ వచ్చిన. నన్నేం పీకలేరు' అనే ఈ డైలాగ్ పుష్ప 2లో ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉన్నదేంటంటే.. 'పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా' అని ఓ సందర్భంలో అంటాడు. అలాగే నా స్నేహితుడి కోసం వస్తా అనే డైలాగ్ కూడా ఉంటుంది.
అయితే ఈ రెండూ డైలాగ్స్ గతంలో ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందో అల్లు అర్జున్ వివరణ ఇస్తున్న సమయంలో చేసినవే.
అంతేకాకుండా అల్లు అర్జున్ చెప్పే డైలాగులు..'ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు', 'ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు' అలాగే ‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా? నీ మాట వినేది.. పావలా లేకున్న పౌరుషం ఎక్కువ వెధవకి..' అనే ఈ డైలాగ్స్ బన్నీ కావాలనే రాయించుకున్నట్టు మెగాఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్ డౌన్‌ఫాల్ను ఓ వర్గం కోరుకుంటుందనే ఉద్దేశ్యంతో కూడినవి.
అంతేకాదు..'ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’ అనే డైలాగ్ మరింత చర్చకి కారణమైంది. ఇది ఓ స్టార్ హీరో, నాయకుడి ఉద్దేశ్యంతో చేసినవని ట్రోలింగ్ జరుగుతుంది.
పుష్ప 2 రిలీజ్కు ముందు బన్నీపై ట్రోలింగ్ రకరకాల విధాలుగా జరిగింది. అల్లు అర్జున్ ఫొటోస్, స్పీచ్ లతో ఇలా పలు విధాలుగా వైరల్ చేశారు. అయిన ఈ అల్లు అర్జున్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తూ వచ్చాడు. ఏదేమైనా పుష్ప 2 రిలీజ్ ఐకాన్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేస్తోంది.కాగా ఈ పదునైన డైలాగ్స్ రాసింది శ్రీకాంత్ విస్సా.