Pushpa2TheRuleTrailer: కౌంట్ డౌన్ స్టార్ట్.. పుష్ప 2 ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం 'పుష్ప2- ది రూలర్' (Pushpa2TheRule). ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ మూవీ.. వచ్చే నెల డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది.

మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మొన్న పుష్ప 2 స్పెషల్ సాంగ్లో శ్రీ లీలను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ అప్డేట్తో ట్రైలర్ రిలీజ్ డేట్కి నిరీక్షణ ముగిసింది. 

ఇవాళ (నవంబర్ 11న) పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ డేట్ని ప్రకటించారు మేకర్స్. ఆదివారం (నవంబర్ 17న) సాయంత్రం 6:03 గంటలకు పుష్ప ట్రైలర్ రిలీజ్ కానుంది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

"సినిమాస్‌లో మాస్ ఫెస్టివల్ ప్రారంభం కావడానికి ముందు ఒక పేలుడు బ్యాంగర్‌... పాట్నా బ్లాస్టింగ్ ఈవెంట్‌తో మొదలు.. నవంబర్ 17న సాయంత్రం 6:03 గంటలకు పుష్ప 2 ట్రైలర్ ను ఆస్వాదించండి" అంటూ కొత్త పోస్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. 

ALSO READ | Netflix Top Movies: IMDB నెట్‌ఫ్లిక్స్ టాప్ 7 ఒరిజినల్ మూవీస్ ఇవే.. డోంట్ మిస్

ఆ తర్వాత కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాదులలో ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు కూడా పుష్ప 2 టీం ఓ వీడియో ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ లేటెస్ట్ ట్రైలర్ అప్డేట్తో ఐకాన్‌ రాక కోసం అసలైన ఉత్కంఠ ఇపుడే మొదలైంది.

ఇదిలా ఉంటే.. పుష్ప-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్ లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలో 6500 స్క్రీన్స్ లలో , ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్ లలో గ్రాండ్‌ గా విడుదలకు సిద్ధమవుతోంది.