Pushpa2TheRule: పుష్ప-2 సెన్సార్, రన్ టైమ్ వివరాలు.. వారు మాత్రం పేరెంట్స్తో కలిసి చూడాలి!

రెండు నెలలుగా టీజర్, ట్రైలర్, సాంగ్స్తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హవా చూస్తూ వస్తున్నారు ఆడియన్స్. ఇక పుష్ప రాజ్ పూర్తి మజా చూడటానికి ఆ సమయం సిద్ధమైంది. పుష్ప 2 (Pushpa2TheRule) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11500 థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్తో దూసుకెళ్తు అల్లు ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నారు.

ఇటీవలే షూటింగ్కి ప్యాకప్ చెప్పిన సుకుమార్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక రిలీజ్కు దగ్గరపడుతున్న తరుణంలో పుష్ప 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా ఈ సినిమా నిడివి గం.3:20 నిమిషాల వరకు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read:-20 ఏళ్ల బంధానికి తెర.. ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

అయితే, క్రెడిట్ టైటిల్స్ కోసమే ఓ 5 నిమిషాల మేరకు టైం తీసుకున్నట్లు సమాచారం. ఇది పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వచ్చే జాతర సీన్ 25 నిమిషాల మేరకు ఉంటుందని.. అది సినిమాకే హైలెట్ పోర్షన్ అని చిత్రయూనిట్ అంటున్నారు.

ఇకపోతే ఓవర్సీస్ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో పుష్ప 2 మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 25 నాటికి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల కోసం $1.478 మిలియన్ డాలర్ల వరకు ప్రీ సేల్స్ ద్వారా సాధించింది. 3519 షోల ద్వారా ఈ మొత్తం రాగా.. ఇక రిలీజ్ ముందువరకు $3 మిలియన్‌కు పైగా వసూళ్లు చేసే అవకాశం కనిపిస్తోంది. పుష్ప 2 మీద ఏ స్థాయిలో హైప్ ఉందో దీన్ని బట్టి ఇట్టే అర్ధమవుతోంది. కాగా ఇండియాలో నవంబర్ 30 నుంచి ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవ్వనున్నాయి. గెట్ రెడీ ఫ్యాన్స్!

'U/A' సర్టిఫికేట్:

ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసి లేదా పెద్దల తోడుగా చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.