Kissik Promo: కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్.. చిన్న బిట్టుతోనే భూకంపం సృష్టించారుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది.

ఇక టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే Nov 24 కిస్సిక్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి కిస్సిక్ సాంగ్ ప్రోమోను ఇవాళ Nov23న మేకర్స్ విడుదల చేశారు.

ALSO READ | Bigg Boss: ఇన్నాళ్లు తెలుగు వాళ్లే.. ఈ వారం(Nov23) కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్!

ప్రస్తుతం ఈ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీడియో అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రొమో విడుదలైన రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల 50 వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ కౌంట్ పెరుగుతూ వస్తోంది.

ఈ కిస్సిక్ సాంగ్ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సింగర్ సుభాషిణి పాడగా.. హిందీలో సుభాషిణి, లోతిక ఝా.. మలయాళంలో ప్రియా జెర్సన్.. బెంగాలీలో ఉజ్జయినీ ముఖర్జీ పాడారు.