2024లో జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు వాహనం కొనాలి

కొత్త సంవత్సరం దగ్గర పడింది. చాలామంది బైక్​లు కార్లు కొనేందుకు ఇష్టపడుతుంటారు. 2024 జనవరిలో కొత్త వాహనాలు కొనేందుకు ఏ రోజు మంచిది... జాతకం ప్రకారం ఏ రంగు వాహనం కొనాలి అనే విషయాన్ని పండితుల దగ్గరకు వెళ్లి తెలుసుకుంటారు.

 మనదేశంలో జ్యోతిష్యానికి ఎక్కువ విలువ ఇస్తాం. మనం ఏది కావాలన్నా పంచాంగం చూసుకోవడం సహజం. ఇల్లు కట్టుకోవాలన్నా వివాహం చేసుకోవాలన్నా ఆఖరుకు వాహనం కొనాలన్నా రంగులు చూసుకోవాల్సిందే. ఏ రాశి వారికి ఏ కలర్ బాగుంటుందో కూడా జ్యోతిష్యమే చెబుతుంది. దీంతో మనకు కావాల్సిన కలర్లను ఎంచుకోవడం మనమీదే ఆధారపడి ఉన్నా కలర్ ను ఎన్నుకోవడం జ్యోతిష్య నిపుణుల మీద ఆధారపడుతున్నారు.   జ్యోతిష్యం ప్రకారం 2024లో  ఏ రాశి వారు  ఏ కలర్​ వాహనం కొనాలో తెలుసుకుందాం. . .

మేషరాశి 

మేష రాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించేందుకు వెనకాడరు. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించరు. వీరికి ఎరుపు రంగు శక్తి, బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది.  మీ వాహనంలో ఎక్కడా నలుపు రంగు ఉండకుండా చూసుకోండి.  వాహనంలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వృషభం 


వృషభ రాశి వారు జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకుంటారు.వీరికి తెలుపు, ఆకుపచ్చ రంగులు బాగుంటాయి. వీరు తమ కారు కొనుగోలు చేసేటప్పుడు ఈ కలర్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వీరు కొనే వాహనంలో శివుని బొమ్మను వాహనంలో ఉంచడం ప్రయోజనకరం.

Also read : 2024లో పెళ్లి ముహూర్తాలు ఇవే...
 

మిధునరాశి

 మిథున రాశి వారు తెలివైన వారుగా ఉంటారు. వీరిఅదృష్ట రంగు పసుపు.  దీంతో వీరు కారు కొనుక్కోవాలనుకుంటే పసుపు రంగు తీసుకుంటే మంచి జరుగుతుంది. గణేశుడి చిత్రాన్ని వాహనంలో ఉంచడం మిథునంనికి మేలు చేస్తుంది 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తారు. 2024లో వారి వాహనానికి అదృష్ట రంగు సిల్వర్​ కలర్​. ఈ రంగు వారి ప్రయాణాల సమయంలో ప్రశాంతమైన ... సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.వాహనంలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

సింహ రాశి 

సింహరాశి వారు గర్వంగా ఉంటారు. 2024లో వారి వాహనానికి అదృష్ట రంగు గోల్డ్​ కలర్​.  వీరు సహజంగా రాజరిక స్వభావాన్ని  కలిగి ఉంటారు.  గోల్డ్​ కలర్​ సింహరాశి వారు ఎక్కడకు వెళ్లినా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. బంగారం అనేది లగ్జరీకి, విజయానికి శుభసూచికం. గాయత్రి మంత్రాన్ని వ్రాసి వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది.

కన్యారాశి

కన్య రాశివారు ఆలోచనాత్మకంగా ప్రవర్తిస్తారు. ప్రశాంత స్వభావంతో మెలుగుతారు. 2024లో వారి వాహనానికి అదృష్ట రంగు నేవీ బ్లూ. నేవీ బ్లూ మేధస్సు, ఖచ్చితత్వం , విశ్వసనీయతను సూచిస్తుంది.  ఈ రంగు కన్యారాశి వారి ప్రయాణాల సమయంలో సమర్దతా భావాన్ని ప్రోత్సహిస్తుంది. శ్రీకృష్ణుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. 

తులారాశి

తులరాశి వారు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు.2024లో వారి వాహనానికి అదృష్ట రంగు లేత గులాబీ. లేత గులాబీ రంగు ప్రేమ, స్నేహం, శాంతి, సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారు వాహనంలో స్వస్తిక చిహ్నాన్ని ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది.

వృశ్చికరాశి 

వృశ్చిక రాశి వారు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తారు.  2024లో వారి వాహనానికి అదృష్ట రంగు ముదురు బ్లూరంగు . ఈ రంగు వృశ్చిక రాశి వారికి శక్తిని సూచిస్తుంది. వీరి వాహనంలో శివుని ప్రతిమను  ఉంచడం వల్ల చాలా  ప్రయోజనం పొందుతాయి.

ధనుస్సు రాశి 

 ధనస్సు రాశి వారి అదృష్ట రంగు ఊదా. ఊదా రంగు జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు ప్రేరణను సూచిస్తుంది. వీరు వాహనాలు కొనేటప్పుడు ఊదారంగు వాహనం కోనుగోలు చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది.

మకరరాశి

మకర రాశి వారు ప్రతిష్టాత్మకంగా, క్రమశిక్షణతో, సంకల్పంతో కూడిన వ్యక్తులు.  వీరి అదృష్ట రంగు నలుపు రంగు.  నలుపు రంగు ఆడంబరం... అధికారాన్ని సూచిస్తుంది. వీరు ఇదే రంగు వాహనాలు కొనుక్కోవడం సురక్షితం.  శ్రీకృష్ణుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. 

కుంభ రాశి

కుంభరాశి వారు తొందరపడకుండా నిదానంగా ఉంటారు. కుంభ రాశి వారు 2024 సంవత్సరంలో వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే...  వారు తమ రాశిని బట్టి రంగును ఎంచుకోవాలి. కుంభ రాశి వారు నీలం రంగు వాహనం కొనుగోలు చేయడం శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇష్టమైన దేవుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది.

మీనరాశి 

మీన రాశి వారిఅదృష్ట రంగు సముద్ర ఆకుపచ్చ.  వీరు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.   2024 లో మీనరాశి వారు వాహనం కొనుగోలు చేస్తే సముద్ర ఆకుపచ్చ కలర్​ లో కొనుక్కోవడం వల్ల లాభం కలుగుతుంది.  సముద్ర ఆకుపచ్చ రంగు శాంతిని సూచిస్తుంది. వాహనంలో హనుమంతుడు ఇమేజ్ ఉంచడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది.

ఇలా పన్నెండు రాశుల వారు తమ జాతక ప్రకారం బాగుండే కలర్లు కావడంతో వాటినే తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.