Sankranthi 2025: సంక్రాంతికి థియేటర్లో భారీ సినిమాలు.. రేసు నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో!

పండుగ వస్తుందంటే చాలు సినిమాల జాతర మొదలైనట్టే. సినీ ప్రేక్షకులు రాబోయే పండుగలకు థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగలంటే చెప్పేదేం ఉంది. హీరోలు ప్రేక్షకులకి ఇచ్చే విందు కోసం బాక్సాఫీస్ సైతం వెయిట్ చేస్తోంది.

ఈ 2024 ఏడాది సంక్రాంతికి భారీ సినిమాలొచ్చి సక్సెస్ అయ్యాయి. ఇక దసరా బరిలో ఓ మోస్తారు సినిమాలొచ్చి.. బాక్సాఫీస్ ముందు తేలిపోయాయి. ఇక దీపావళికి వచ్చిన సినిమాలైతే బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేలా భారీ సక్సెస్ను రుచిచూశాయి. ఇక రాబోయే 2025 సంక్రాంతి కోసం హీరోలొస్తున్నారు.. వారి భారీ సినిమాలొస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ లెక్కల మోత మోగాల్సిందే! మరి ఎలాంటి సినిమాలు వస్తోన్నాయి? ఎవరైనా ఈ బరి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయా? అనేవి ఓ లుక్కేద్దాం. 

అందులో ముందుగా చెప్పుకోవాలంటే రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబోలో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌. ఈ మూవీ 2025 జనవరి10న రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించారు. 

వెంకటేష్, అనిల్‌ రావిపూడి కాంబోలో వస్తోన్న మూడో సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీ కూడా దిల్ రాజు నిర్మించారు.

బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ 'డాకు మహారాజ్‌'. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘మజాకా’ చిత్రంలో జనవరి 11న రిలీజ్ కానుంది. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

అయితే, ఈ సినిమాలతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సైతం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య అధికారిక ప్రకటన చేశారు. కానీ, ఇపుడీ ఈ సినిమా రిలీజ్ కావట్లేదని సమాచారం. నిన్న Nov 24న చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరు 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సినిమా విషయమై స్పందించారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించినట్లు ప్రకటించారు. దాంతో సంక్రాంతి రేసు నుంచి ఓ భారీ ప్రాజెక్ట్ మూవీ తప్పుకున్నట్లు కన్ఫమ్ అయింది.

ఈ క్రమంలో మిగతా సినిమాలకి కాస్తా కలిసొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి ఫైట్ ఎలాంటి భీభత్సం సృష్టించనుందో అనే దానిపై ఇప్పటికే ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పెరిగింది.