Release Movies: (Nov28) థియేటర్/ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం( Nov28) కూడా థియేటర్/ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.

ఈ వారం థియేటర్‌లో::

'మిస్‌ యూ’ (Miss You):

హీరో సిద్దార్థ్ యంగ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కలిసి నటించిన  మూవీ 'మిస్‌ యూ’ (Miss You). క్లాసికల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ ఎన్. రాజశేఖర్ రూపొందించాడు. మిస్ యూ సినిమా ఇవాళ గురువారం (నవంబర్ 28న) వరల్డ్ వైడ్ గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచాయి.

Also Read:-తాజాగా 45వ చిత్రాన్ని మొదలుపెట్టిన హీరో సూర్య

రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance):

హర్ష నర్రా, మేఘలేఖ జంటగా  సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, ఖుష్బూ చౌదరి ముఖ్య పాత్రల్లో విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు. న‌‌లుగురు స్నేహితుల క‌‌థ ఇది. యూత్‌‌ఫుల్ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ  గురువారం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

భైరతి రణగల్‌ (Bhairathi Ranagal):

క‌న్న‌డ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ హీరో న‌టిస్తున్నలేటెస్ట్ మూవీ భైరతి రణగల్‌ (Bhairathi Ranagal). ఈ సినిమాకు నర్తన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. స‌ప్త సాగ‌రాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబరు 29న) రిలీజ్ కానుంది.

ఈ వారం ఓటీటీ లిస్టులో క్రైమ్, మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్స్‌తోపాటుగా ఇతర జోనర్స్‌లో మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్

కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెన్నెట్ రామ్సే (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 25

ఆంటోనీ జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 26

అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 27

చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబర్ 27

లక్కీ భాస్కర్ (తెలుగు, మలయాళ) - నవంబర్ 28

ది మ్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29

సికందర్ కా మఖద్ధర్ (హిందీ మూవీ)- నవంబర్ 29

ది స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ)- నవంబర్ 29

సెన్నా (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

ది ట్రంక్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

ఈటీవీ విన్‌

కిరణ్ అబ్బవరం ‘క’ 

జీ5

వికటకవి (వెబ్‌సిరీస్‌) (నవంబరు 28)

డివోర్స్‌ కే లియా కుచ్‌ బీ కరేగా (హిందీ) నవంబరు 29

అమెజాన్ ప్రైమ్

సేవింగ్ గ్రేస్ (తగలాగ్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

బ్లడీ బెగ్గర్ (తమిళ్) : నవంబర్ 29 

హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 29

డిస్నీ+హాట్‌స్టార్‌

పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు  29

సన్‌ నెక్ట్స్‌

కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29

బుక్ మై షో ఓటీటీ

ది వైల్డ్ రోబో (ఇంగ్లీష్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 29

వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29

జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ)- నవంబర్ 29

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ)-నవంబర్ 29