కొత్త సంవత్సరం రోజు ఇలా చేయండి.. నెగిటివ్​ ఎనర్జీ దూరం అవుతుంది. ..

2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం అవుతుంది. అందుకే జనవరి 1న శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం చాలా శివాలయాలను ఇప్పటి నుంచే అలంకరిస్తారు. మీరు కూడా సంతోషం, అదృష్టం, సంపదను పెంచుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున స్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే ఆచారాలతో శివుడిని పూజించండి. అంతేకాదు ఈ రోజు శివునికి సంబంధించిన మూడు వస్తువులను కూడా ఇంటికి తీసుకురండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరం మొదటిరోజు ఇంటికి ఏం తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేవుళ్ల దేవుడైన శివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజు శివపార్వతులను నిష్టగా పూజిస్తారు. అంతేకాదు చాలా మంది భక్తులు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాసం వల్ల యోగ్యత,  మహిమతో కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు ఇంట్లో సంతోషం, సౌభాగ్యం, శాంతి కూడా కలుగుతాయి. 

ఢమరుకం

ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవాలంటే కొత్త సంవత్సరం మొదటి రోజు తప్పకుండా మీ ఇంటికి శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకాన్ని తీసుకురండి. ఆ తర్వాత శివపార్వతులను నియమాల ప్రకారం పూజించండి. పూజ చేసిన తర్వాత ఇంట్లోని అన్ని గదులలో డమరుకాన్ని వాయించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ పవర్ ట్రాన్స్ ఫర్ అవుతుంది.

 శివలింగం

మీరు శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే.. కొత్త సంవత్సరం మొదటి రోజు శివలింగాన్ని ఇంటికి తీసుకురండి. నియమాల ప్రకారం  శివలింగాన్ని పూజించండి.  శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల జీవితంలోని దుఃఖాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది.  అయితే రెండు అంగుళాలకు మించి శివలింగం ఉంటే నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టాలి.   అలా కుదరని పక్షంలో శివలింగాన్ని సోమ, మంగళ వారాలు సంప్రదాయంగా  పూజించి.. బుధవారం అంటే జనవరి 3 వతేదీన ఏదైనా గుళ్లో ఇవ్వండి.

త్రిశూలం

మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటే.. కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటికి త్రిశూలాన్ని తీసుకురండి. ఈ రోజున శివుడిని, అతని ఆయుధాలను ప పూజించండి. ఇంట్లో త్రిశూలాన్ని ఉంచడం వల్ల ఆదాయం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో పాజిటివ్ పవర్ వ్యాప్తి చెందుతుంది