2+0+2+4= 8 శని స్థానంలో మార్పు... ఏ రాశి వారికి ఎలాగంటే...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 వ సంవత్సరాన్ని శని సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం  శని గ్రహం 8 అంకెతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2024  ( 2+0+2+4=8) కావడం వల్ల సంవత్సరం మొత్తం శని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా రాహు కేతువుల ప్రభావం కూడా ఏడాది పొడవునా ఉంటుంది. అలాగే చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. ఇలా అన్ని గ్రహాలు రాశుల్లో ప్రత్యేక స్థానాల్లో ఉండబోతున్నాయి. కొన్ని జాతకాలపై శని ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జనవరి నెలలో శని సాడే సతితో బాధపడుతున్న వారికి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలా మొత్తం 5 నెలల పాటు శని కొన్ని రాశులపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే 2024 సంవత్సరంలో శని గ్రహం కారణంగా ఏ ఏ రాశుల వారికి మంచి జరుగుతుందో ఏ ఏ రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024లో ఎవరికి లాభం?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై శని శుభప్రభావాన్ని చూపబోతోంది. ముఖ్యంగా మేష, మిధున, కన్య, ధనస్సు రాశి వారికి శని గ్రహం ప్రత్యేక అనుగ్రహాన్ని అందించబోతోంది. దీని వల్ల ఈ రాశుల వారు 2024 సంవత్సరంలో ఊహించని లాభాలు పొందుతారు..

ఈ రాశుల వారిపై దుష్ప్రభావం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి పైన శని దుష్ప్రభావం పడనుంది. ముఖ్యంగా కర్కాటకం, తుల, కుంభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లను వదులుకుంటేనే మీ జీవితం మంచిగా ఉంటుంది. లేదంటే.. అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీరు సంపాదించిన డబ్బు మొత్తం మీ కోసమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

చెడు ప్రభావం తగ్గించడం ఎలా?

శని సడే సతీ, దయ్యా ప్రభావాలు తొలగిపోయేలా చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించి తప్పించుకోవచ్చు. శనివారం నాడు రావి చెట్టు, శమీ చెట్టుని పూజించాలి. అలాగే శని వారం రావి చెట్టుకు, శమీ చెట్టుకి నీరు సమర్పించాలి. సాయంత్రం ఆవ నూనెలో నల్ల నువ్వులు కలిపి చెట్టు ముందు దీపం వెలిగించాలి. శని దేవుని ఆశీస్సులు పొందటం కోసం శమీ చెట్టుని పూజించడం చాలా మంచిది. ప్రతిరోజూ శని చాలీసా, శివ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల ఆయన శని దేవుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది.