Career horoscope: ఏ రాశి వారు ఏ వృత్తిలో రాణిస్తారో తెలుసా...

ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో బాగా కష్టపడతారు.  కాని కలసిరాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వారి జీవితం కొనసాగుతుంది.  కొంతమంది ఇలా ఉద్యోగంలో చేరారో లేదో.. వెంటనే ఉన్నత శిఖరాలకు చేరుతారు.  వారికంటే బాగా కష్టపడతారు.. కాని కలసిరాలేదని నిరుత్సాహానికి గురవుతారు. కొంతమంది చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తూ జీవితం కొనసాగిస్తుంటారు.  అయితే జ్యోతిష్య శాస్తప్రకారం జన్మలగ్నాన్ని బట్టి రాశిని నిర్ణయిస్తారు.  కొన్ని రాశుల వారు కొన్ని రంగాల్లో మాత్రమే రాణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ఏ రాశివారు ఏ రంగాల్లో ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకుందాం.  .

చదువు అయిపోయింది కదా మరి నెక్ట్స్ ఏంటి నీ ప్లాన్? ఇది చాలా మంది యువత ఎదుర్కొనే ప్రశ్న. చదువు పూర్తి చేసిన తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి బంధువులు, స్నేహితుల వరకు అడిగే ఒకే ఒక్క మాట ఇదే.అయితే  మీరు ఏరాశిలో జన్మించారో .. దాని ప్రకారమే   మీ కెరీర్  ముడి ఉంటుంది.   మీ జీవితంలో కనిపించే ప్రతి సంకేతం మిమ్మల్ని ఉద్యోగం వైపు నడిపించే ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటుంది.  కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగాలు రావు. మరికొన్ని సార్లు ఆర్థిక కష్టాల వల్ల చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.

మేష రాశి

మేష రాశిని అంగారకుడు పాలిస్తాడు. అగ్ని మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి కలిగిన వాళ్ళు కాస్త అహంకార ధోరణిలో ఉంటారు. అలాగే ఇతరులని ప్రేరణగా తీసుకుంటారు. తాము ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే అది నెరవేర్చే కృషి, పట్టుదల ఈ రాశి వారికి ఉంటుంది. అందుకే ఇటువంటి వారికి మోటివేషనల్ స్పీకర్ గా కెరీర్ ని ఎంచుకుంటే బాగా రాణిస్తారు. వారి ఉత్సాహభరితమైన స్వభావానికి ఇటువంటి ఉద్యోగం చక్కగా సరిపోతుంది.

వృషభ రాశి

వృషభ రాశి శుక్రుడుచే పాలించబడుతుంది. వృషభం చాలా శక్తివంతమైనది. భూమి మూలకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీళ్ళు ఆదర్శవంతమైన కెరీర్ ని ఎంచుకుంటారు. తమ లక్ష్యాల వైపు స్థిరంగా పని చేసేందుకు మొగ్గు చూపుతారు. కింది స్థాయి నుంచి ఎదుగుతారు. ఏవైనా కార్పొరెట్​ కంపెనీల్లో  ఉద్యోగాలని ఎంపిక చేసుకోవడం సరైన మార్గం.

మిథున రాశి

వాయు రాశిగా పేరు గాంచిన మిథున రాశి వాళ్ళు గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు. బుధుడు పాలిస్తాడు. ఈ రాశి వారు తమ కెరీర్ ని బోధన వైపు మళ్లించుకుంటే బాగుంటుంది. టీచింగ్ లేదా లెక్చరర్ వంటి కెరీర్ వీళ్ళ అనుకూలమైన స్వభావానికి చక్కగా సరిపోతుంది.

కర్కాటక రాశి

చంద్రునిచే పాలించబడే రాశి కర్కాటకం. నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. కుటుంబం, భావోద్వేగాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు వీరికి సరిపోతాయి.

సింహ  రాశి

సూర్యునిచే పాలించబడే రాశి సింహం. అగ్నితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి కలిగిన వాళ్ళు పనిలో సృజనాత్మకతను, సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. ఆర్ట్, క్రియేటివ్ ఫీల్డ్ వీరికి సరిపోతుంది. అప్పుడప్పుడు అసూయ స్వభావం వీరిలో కనిపిస్తుంది.

కన్య రాశి

కన్యారాశిని బుధుడు పాలిస్తాడు. వీరికి మానసిక సామర్థ్యం ఎక్కువ. ఆచరణాత్మక, జాగ్రత్తగా ఉండే విధానాన్ని కలిగి ఉంటారు. సైన్స్, పరిశోధన ఆధారిత రంగాలు వారి స్వభావానికి అనుగుణంగా ఉంటాయి.

తులా రాశి

వాయు సంకేతంగా భావించే తులా రాశిని శుక్రుడు పాలిస్తాడు. న్యాయానికి విలువ ఇస్తారు. న్యాయవాద కెరీర్ ఎంచుకుంటే మంచిది. ఇది వారి కీర్తిని మరింత మెరుగుపరుస్తుంది.

వృశ్చిక రాశి

నీటి మూలకం కలిగిన వృశ్చిక రాశి అంగరాకుడిచే పాలించబడుతుంది. ఈ రాశి వారి మనస్తత్వం అసూయ, హింసాత్మకం, డబుల్ మైండ్ గా ఉంటుంది. ఇటువంటి వారికి రాజకీయ రంగం సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు మాట మీద నిలబడలేరు.

ధనస్సు రాశి

అగ్ని చిహ్నమైన ధనస్సు వారికి సహాయం చేసే స్వభావం ఎక్కువ. కష్టపడే తత్వం కలిగి ఉంటారు. బృహస్పతి పాలిస్తాడు. ఇతరులకి సహాయం చేసే కెరీర్ ఎన్జీవో వంటి వాటిలో పని చేసేందుకు కెరీర్ గా ఎంచుకుంటే బాగుంటుంది. వారికి ఉన్న కరుణ, చురుకైన స్వభావానికి ఇవి చక్కగా సెట్ అవుతాయి.

మకర రాశి 

భూమికి ప్రాతినిథ్యం వహిస్తున్న మకర రాశి వాళ్ళు తప్పు నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. శనిచే పాలించబడే రాశి చక్రం. వ్యాపారం, రిటైల్ దుకాణం వంటి వాటిని కెరీర్ గా ఎంచుకుంటే బాగా రాణిస్తారు. వ్యాపార లక్షణాలు వీరికి మెరుగ్గా ఉంటాయి.

కుంభ రాశి

వాయు సాంకేతమైన కుంభ రాశికి అధిపతి శని. ఇతరులతో ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. తమ మాటలతో ఎవరినైనా ఆకర్షించగలుగుతారు. అడ్వర్టైజింగ్ లేదా మార్కెటింగ్ కెరీర్ ఉత్తమంగా ఉంటుంది.

మీనరాశి

నీటి మూలకంతో సంబంధం కలిగిన మీన రాశికి బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. బలమైన మానసిక లక్షణాలు కలిగి ఉంటారు. సైకాలజీ కెరీర్ లో బాగా రాణిస్తారు.