Zomato District: జొమాటో యూజర్లకు గుడ్న్యూస్..గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం కొత్త యాప్

Zomato ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం..ఇప్పుడు ట్రావెలింగ్, ఈవెంట్స్ వంటి కోసం టికెటింగ్ సేవలను కూడా అందించేందుకు సిద్దంగా ఉంది. అందుకోసం కొత్త యాప్ ను లాంచ్ చేసింది. జొమాటో గోయింగ్ అవుట్ బిజినెస్ కోసం డిస్ట్రిక్ట్ యాప్ ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం Appl iOS ప్లాట్ ఫాంలో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఫుడ్ డెలివరీ, ఫాస్ట్ బిజినెస్ లలో ముందున్న జొమాటో మూడు ఫ్లాట్ ఫాంగా గోయింగ్ అవుట్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టింది. జొమాటో కొత్తయాప్ డిస్ట్రిక్ట్ ద్వారా దాని గోయింగ్ అవుట్ వర్టికల్ కోసం డైనింగ్, లైవ్  అవెంట్లు, టికెటింగ్ వంటి సేవలను అందించనుంది. ఇటీవల Paytm ఈవెంట్స్ విభాగాన్ని కొనుగోలుచేసిన జొమాటో.. ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. Zomato సూపర్ యాప్ లకు బదులుగా సూపర్ బ్రాండులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ALSO READ | పండుగ కాలంలో బండ్లకు భారీ గిరాకీ .. 42.88 లక్షల యూనిట్ల అమ్మకం

2024 ఆగస్టులో Paytm ఈవెంట్లు, టికెటింగ్ వ్యాపారాన్ని రూ. 20,048 కోట్లకు జొమాటో కొనుగోలు చేసింది. డిస్ట్రిక్ట్ యాప్ ప్రస్తుతం కంపెనీ డైనింగ్ అవుట్ ఆఫర్ తోపాటు సినిమాలు, లైవ్ ఈవెంట్ల కోసం టికెట్లను బుక్ చేసుకునేందుకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.