Work-life balance: వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై Zepto సీఈవో సంచలన కామెంట్స్.. ఇంటర్నెట్లో జోరుగా చర్చ

వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై Zepto సీఈవో సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అన్నింట్లో దీనిపైనే చర్చ.. జెప్టో ఉద్యోగులతో పాటు పెద్ద ఎత్తున నెటిజన్లు  కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ జెప్టో సీఈవో ..వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఏమంటున్నారు.. నెటిజన్లు, జెప్టో ఉద్యోగులు ఏమంటున్నారంటే.. 

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై రెడ్డిట్ యూజర్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. జెప్టోలో టాక్సిక్ వర్క్ కల్చర్ నడుస్తోంది ఆ యూజర్ పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో జెప్టో సీఈవో కూడా దీనిపై స్పందించారు. 

రెడ్డిట్ యూజర్ తన పోస్టులో జెప్టోలో వర్క్ కల్చర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెప్టో కంపెనీలో తాను సంవత్సరకాలం గా పనిచేస్తున్నానని.. ఈ కంపెనీలో ప్రమాదకరమైన పనితీరు ఉందని రాశాడు. ఎంప్లాయీస్ వర్క్ షెడ్యూల్, వ్యాపార విధానాలపై పలు కామెంట్స్ చేస్తూ రాశాడు. 22యేళ్ళ జెప్టో సీఈవో ఆదిత్ మధ్యాహ్నం 2గంటలకు తన వ్యాపారాన్ని ప్రారంభించారు.. ఎందుకంటే అతను తొందరగా మేల్కొనలేడు.. అందుకే తెల్లవారు జామున మీటింగ్ లు పెడతాడు అని వ్యంగ్యంగా రాశాడు. 

అంతే కాదు జెప్టోలో కేవలం యువకులు మాత్రమే పనిచేస్తారు.. సీనియర్స్ పనిచేయరు.. ఎందుకంటే ఇటువంటి విషపూరితమైన పని షెడ్యూల్ లో వారు పనిచేసేందుకు ఇష్టపడరు అని తన పోస్టులో రాశాడు. 

రెడ్డిట్ యూజర్.. కంపెనీ ఉద్యోగి పోస్టు  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా జెప్టో సీఈవో ఎట్టకేలకు స్పందించాడు.. తాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు వ్యతిరేకంగా కాదని.. నా పోటీదారులందరికీ దీనిని రికమెంట్ చేస్తానని ప్రకటించాడు. 

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్చర్ పై గతంలో కూడా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీశాయి. తాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్చర్ ని తాను ప్రోత్సహించనని.. వారానికి 72 గంటల పని గంటలను ప్రోత్సహిస్తానని స్పష్టంగా చెప్పారు. దీనిపై పలు కంపెనీలకు చెందిన ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు.