భూ వివాదాల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ రవి

జహీరాబాద్, వెలుగు: భూ వివాదాల్లో ప్రజలను బెదిరింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సీఐ రవిహెచ్చరించారు.ఆదివారం ఆయన ఆఫీసులో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కోహిర్, మొగుడం పల్లి  మండల్లాలో కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి సెటిల్​మెంట్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి వారిపై పీడీయాక్ట్​ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భూ తాగాదా కేసులన్నీ సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు లక్ష్మారెడ్డి, ప్రసాద్, కృష్ణ, నరేశ్ పాల్గొన్నారు.