ఆర్డీవో ఆఫీస్ ముందు నిర్వాసితుల ధర్నా

జహీరాబాద్, వెలుగు: నిమ్జ్  పరిధిలోని కూలీలకు, భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం కల్పించి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్  చేస్తూ బుధవారం ఆర్డీవో ఆఫీస్​ ముందు భూ నిర్వాసితులు ధర్నా చేశారు. 

ఈ సందర్భంగా సీపీఎం నేత బి. రాంచందర్  మాట్లాడుతూ నిమ్జ్  రైతులకు, కూలీలకు పునరావాసం కల్పించి, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్  చేశారు. ఎల్గొయి, ముంగి గ్రామాల్లో గత ప్రభుత్వం 123జీవో  ద్వారా పరిహారం ఇచ్చి మోసం చేసిందన్నారు.

 కాంగ్రెస్  ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులందరికీ ఎకరాకు రూ.15 లక్షలు పరిహారం ఇచ్చి న్యాయం చేయాలన్నారు. పునరావాసం  ఇవ్వకుండా పరిశ్రమలకు భూములు కేటాయించవద్దని కోరారు. అనంతరం ఏవో వంశీకృష్ణకు వినతిపత్రం అందచేశారు. ఎల్గొయి, ముంగి, ముంగి తాండ, బర్దిపూర్, బుచ్చినెల్లి గ్రామాలకు చెందిన రైతులు, కూలీలు పాల్గొన్నారు.