పీహెచ్​సీలను సందర్శించిన ఎన్సీడీ సెంట్రల్ టీమ్

ములుగు, వెలుగు :  ములుగు మండల కేంద్రంలోని పీహెచ్​సీ, మామిడియాల సబ్ సెంటర్ ను బుధవారం నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ వైద్య అధికారులు సందర్శించారు. పీహెచ్​సీలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్, బీపీ, షుగర్, టుబాకో, మానసిక రోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఆన్ లైన్ లో నమోదు చేసిన పేషెంట్ల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని సెంట్రల్ అధికారులు సేన శర్మ, మార్గె, తరన్నం, సిన్హా, కథేరినే లాల్మ్ నవౌమి, యుగేశ్ కుమార్ రే, అర్జెన్ షేర్పా, అహంతెం విక్టర్ సింగ్, నమిత నీలకంథ్, ఆశిష్, ములుగు స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.