మల్లన్న ఆలయానికి వాటర్​ ఫ్యూరిఫయర్ ​బహూకరణ

కొమురవెల్లి, వెలుగు: కొమురెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి వరంగల్ కు చెందిన యశ్పాల్ సోనియా రూ.4 లక్షల వ్యయంతో వాటర్ ప్యూరిఫయర్ యంత్రాన్ని బహూకరించారు.

గురువారం ఈవో బాలాజీ వాటర్​ఫ్యూరిఫైడ్​యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు దాత దంపతులకు స్వామివారి లడ్డు ప్రసాదం అందించి  ఘనంగా సన్మానించారు.