బెల్లంపల్లిలో 2కే రన్

బెల్లంపల్లి, వెలుగు: ప్రపంచ డయాబె టిస్ డే సందర్భంగా బెల్లంపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం 2కే రన్ నిర్వహించారు. మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణకు వ్యాయామం, వాకింగ్ తప్పనిసరిగా చేయాలని కోరారు. బాలగంగాధర్ తిలక్ సింగరేణి క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. పాత బస్టాండ్, కాంటా చౌరస్తా మీదుగా నంబర్ 2 క్రీడా మైదానం వరకు కొనసాగింది.

 ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కట్కూరి సత్యనారాయణ , సెక్రటరీ పైడాకుల రాజన్న, ఆదర్శ్, వినోద్ కుమార్, కేశవరావు, శ్రీధర్ స్వామి, ఢీకొండ రాజలింగు, వంగల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.