పెండింగ్ ​వేతనాలు చెల్లించాలి

  •     కనీస వేతనం ఇయ్యాలే
  •     జీపీ, మున్సిపల్​కార్మికుల ధర్నా

సంగారెడ్డి టౌన్, వెలుగు: పెండింగ్​లో ఉన్న జీపీ కార్మికుల వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్​అమలు చేయాలని, కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీపీవో, ఏవోకు అందజేశారు. 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తూ రెగ్యులర్​గా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కారోబార్, బిల్ కలెక్టర్లను జీపీ సెక్రటరీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి దశరథ్, వెంకటరాజు, నగేశ్, లక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు.

కంది: మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇయ్యాలని, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నా మున్సిపల్ సిబ్బంది అడుగడుగునా వివక్షతకు గురవుతున్నారన్నారు. 

కొత్తగా నియమంచిన కార్మికులకు పాత కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. వయస్సు మీరిన, అనారోగ్యానికి గురైన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజు, సుగుణమ్మ,  నరసమ్మ, సంగీత,  శశికళ,  వేణు, యాదగిరి,  రాజు,  సంగమేశ్వర్,  లక్ష్మీనారాయణ, నరసింహులు, యాదయ్య,  రాజేశ్వర్, నాగరాజు, నర్సింలు పాల్గొన్నారు.