- బెల్ట్ షాపులు ఎత్తేయాలని మహిళల ఆందోళన
కాగజ్ నగర్, వెలుగు: బెల్ట్ షాపులతో తమ కుటుంబాలు రోడ్డున పడున్నాయని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామానికి చెందిన మహిళలు మంగళవారం బెల్ట్ షాపులు ఎత్తివేయాలని కోరుతూ కాగజ్ నగర్–సిర్పూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గ్రామంలోని బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
పెద్దలు, యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని, కుటుంబాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని వాపోయారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు డబ్బులు లేకపోతే పట్టా పాస్ బుక్ లు కుదువ పెట్టుకుని లిక్కర్ ఇస్తున్నారని పేర్కొన్నారు. రూరల్ ఎస్ఐ మహేందర్ వెళ్లి మహిళలకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.