డెలివరీ తర్వాత మహిళ మృతి

 

గజ్వేల్, వెలుగు : డెలివరీ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ హైదరాబాద్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇందుకు ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌లో జరిగింది. తూప్రాన్‌‌‌‌ మండలం రామాయిపల్లికి చెందిన చెందిన జక్కుల లక్ష్మణ్‌‌‌‌ భార్య భవాని (22)  డెలివరీ కోసం గజ్వేల్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ చేశారు.

 గురువారం ఉదయం భవానికి ఆపరేషన్‌‌‌‌ చేయగా మగ బిడ్డ పుట్టాడు. కొద్దిసేపటికి భవానీ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్లాలని డాక్టర్‌‌‌‌ సూచించారు. భవానీని బంధువులు హైదరాబాద్​తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో గజ్వేల్‌‌‌‌లోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యం కారణంగానే భవాని చనిపోయిందంటూ కుటుంబ  సభ్యులు డెడ్‌‌‌‌బాడీతో హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.