ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి

సిద్దిపేట జిల్లా  చేర్యాల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మే 13వ తేదీ సోమవారం  లోక్సభ ఎన్నికల వేళ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే పోలింగ్ సిబ్బంది.. సదరు మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వెద్యులు తెలిపారు. గుండె పోటు రావడంతోనే మృతి చెందిందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఉప్పల్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో  మృతి  చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్సభ ఎన్నికల వేళ  ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు  వచ్చి గుండెపోటు రావడంతో  పోలింగ్ స్టేషన్ లోనే మృతి చెందింది.