ద్రవ్యలోటును తగ్గిస్తాం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖర్చును మరింత పెంచుతామని,  జీడీపీలో ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గిస్తామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తాజా రిపోర్ట్​ పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి  వచ్చే నెల ఒకటిన బడ్జెట్ ​ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మంత్రిత్వశాఖ ఈ విషయాలను వెల్లడించింది. అప్పులను తగ్గించుకుని, ఆదాయాలను పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. ఆర్థిక ఏకీకరణ కారణంగానే మనదేశ వృద్ధి బాగుందని, ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల పక్కన చోటు సంపాదించిందని పేర్కొంది. అంతర్జాతీయ సమస్యల కారణంగా వృద్ధికి కొన్ని సవాళ్లు ఉన్నాయని తెలిపింది.