బంగారంపై పెట్టుబడి.. ఫిజికల్ గోల్డ్ vs గోల్డ్ ఈటీఎఫ్ ..15 ఏళ్లలో ఏది ఎక్కువ లాభం ఇచ్చింది..

బంగారం.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన వస్తువు.. అంతకంటే విలువైన పెట్టుబడి. కష్టపడి సంపాదించిన డబ్బుతో గోల్డు కొంటే కొన్నాళ్లకు మంచి లాభం వస్తుందనేది అందరికీ ఉన్న నమ్మకం. చేతిలో డబ్బులు ఉంటే బ్యాంకులో దాయడమో.. లేదంటే పిల్లల పెల్లికి పనికి వస్తుందని బంగారం కొనిపెట్టడమో జరుగుతుంది. కొందరైతే బంగారాన్ని ఒక పెట్టుబడిలా చూస్తారు. ఇప్పుడు కొని దాచితే ఓ ఐదు, పదేళ్ల తర్వాత చాలా లాభం వస్తుందని కొని దాస్టూ ఉంటారు. ఎలాంటి మార్కెట్ సూత్రాలు అవసరం లేని పెట్టుబడి బంగారం. 

అయితే గతంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కావు. ఫిజికల్ గా బంగారం కొని దాచుకునేవాళ్లు. అయితే ప్రస్తుతం మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs), గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs), గోల్డు ఫండ్స్, డిజిటల్ గోల్డు, ఫిజికల్ గోల్డు.. ఇలా రకరకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని రకాల బంగారాలలో ఏ బంగారంలో పెట్టుబడి పెడితే.. ఓ 5, 10, 15 ఏళ్ల తర్వాత ఎక్కువ లాభం వస్తుంది చాలా మందికి ఉన్న సందేహం. మార్కెట్లో ఉన్న వివిధ రకాల గోల్డ్ గురించి ఇప్పుడు వివరంగా చర్చిద్దాం.

సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs):

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సంవత్సరానికి 2.5 శాతం ఇంట్రెస్ట్ తో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. వడ్డీ సంవత్సరానికి రెండు సార్లు జమ అవుతుంది. ఇందులో ఒక ఫ్యామిలీకి  1 గ్రామ్ నుంచి 4 కేజీల వరకు కొనుకునే అవకాశం ఉంటుంది. ట్రస్టులు 20 కేజీల వరకు కొనొచ్చు.

గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs):

ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (Exchange-Traded Funds) అంటారు. ఇవి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటాయి. మార్కెట్ ప్రైజ్ ప్రకారం కొనడం అమ్మడం జరుగుతుంటుంది. దీన్ని పాసివ్ ఇన్ కం పెట్టుబడిలా భావిస్తుంటారు.

గోల్డు ఫండ్స్:

ఇతర మ్యుచువల్ ఫండ్స్ లాగే ఇవి గోల్డ్ మ్యుచువల్ ఫండ్స్. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎస్ఐపీ (Systematic Investment) అవకాశం ఉంటుంది. మినిమమ్ రూ.500లతో పెట్టుబడి పెట్టవచ్చు. 

డిజిటల్ గోల్డ్:

డిజిటల్ గోల్డ్ కు 99.9 శాతం స్వచ్చమైన బంగారానికి సమానమైన విలువ ఉంటుంది. సంప్రదాయంగా ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ మొదలైన వాటికి బదులు డైరెక్ట్ గా డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. 

ALSO READ | అమ్మా.. నిర్మలమ్మా:మీరు మీ పాత కారు అమ్ముతున్నారా..18 శాతం GST కట్టండి

ఫిజికల్ గోల్డ్: 

ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, గోల్డ్ బిస్కెట్స్ మొదలైన రూపంలో ఉంటుంది. ఇది కామన్ గా అందరికీ తెలిసిందే. 24 , 22, 18 క్యారట్లలో లభ్యమవుతుంది. 

మంచి లాభాలిచ్చే మార్గం.. గోల్డ్ ఈటీఎఫ్ :

ఒకవేళ 2025లో బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే గోల్డ్ ఈటీఎఫ్ బెటర్ అంటున్నారు ఆనంద్ రథీ సంస్థకు చెందిన చేతన్ షెనాయ్.  99.5% పూరిటీ గోల్డ్ కు సమానంగా గోల్డ్ ఈటీఎఫ్ ను చూడవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఏడాదికి సంబధించి సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంచ్ చేయలేదు. అందువల్ల పోర్ట్ ఫోలియోలో 10 శాతం వరకు వెయిటేజ్ తో గోల్డ్ ఈటీఎఫ్ కొనవచ్చు అని చెబుతున్నారు. 

గత ఐదు, పది, పదిహేనేళ్లలో ఏది ఎక్కవ లాభం ఇచ్చింది.. గోల్డ్ లేదా  గోల్డ్ ఈటీఎఫ్ :

గత ఐదేళ్లలో ఫిజికల్ గోల్డ్ 20 శాతం CAGR లాభం ఇస్తే.. ఈటీఎఫ్ 13.8 శాతం నుంచి 14.07 శాతం లాభాలను ఇచ్చింది. అదే విధంగా గత పదేళ్లలో 12 శాతం CAGR రిటర్న్ ఇస్తే..  ఈటీఎఫ్ 10.02 నుంచి 10.08  CAGR రిటర్న్ ఇచ్చింది. పదిహేనేళ్ల రిటర్న పోల్చితే.. ఫిజికల్ గోల్డ్ 10 శాతం CAGR రిటర్న్ ఇస్తే.. ఈటీఎఫ్ 9.54 నుంచి 9.62 శాతం రిటర్న్ ఇచ్చింది. 

ఏది బెటర్.. ఫిజికల్ లేదా ఈటీఎఫ్:

పైన చెప్పిన రిటర్న్ లను పోల్చితే 5 ఏళ్లలో ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్ తో పోల్చితే ఎక్కువ లాభ ఇచ్చింది. పదేళ్లలో రిటర్న్ పోల్చితే ఫిజికల్ కాస్త ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. అయితే 15 ఏళ్ళ లాంగ్ టర్మ్ రిటర్న్ చూస్తే లాభంలో తేడా అంత ఎక్కువగా లేదు. ఆల్ ఓవర్ గా ఫిజికల్ గోల్డ్ ఎక్కువ రిటర్న్ ఇచ్చినప్పటికీ.. ఈటీఎఫ్ కన్వీనియెంట్ గా, లిక్విడిటీ ఎక్కువగా ఉండటం కొంత ప్లస్ పాయింట్. అయితే ఇది ఇన్వెస్టర్ల కన్వీనియెన్స్ ను బట్టి ఉంటుంది. కొందరు ఫిజికల్ బెటర్ అనుకుంటారు.. కొందరు ఈటీఎఫ్ బెటర్ అనుకుంటారు. మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.