తులం బంగారం ఎప్పుడిస్తరు?

  • అసెంబ్లీలో  బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిలదీత

హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు."  మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా అమలు చేయడం లేదు. రూ.500కే గ్యాస్​ సిలిండర్​ఇస్తామన్న హామీనీ నెరవేర్చలేదు. 

కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో తెలీదు. కేసీఆర్​ సర్కార్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్​కిట్, కేసీఆర్ కిట్ లను కనీసం పేరు మార్చి అయినా అమలు చేయండి.   దండారీలు, సమ్మక్క సారక్క, జోడేఘాట్​దర్బార్​కు నిధులివ్వాలి. దండారీలకు గత ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చింది. దానికి మరో రూ.10 వేలు కలిపి కాంగ్రెస్​ సర్కారు రూ.20 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి" అని కోవా లక్ష్మి కోరారు.