- ప్రైవేట్ కంపెనీలో ఘటన
శివ్వంపేట, వెలుగు: చట్నీలో బల్లి పడగా.. అది తిన్న పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామ లో ఫ్లెమింగ్ కంపెనీలో జరిగింది. కంపెనీ క్యాంటీన్ లో మంగళవారం టిఫిన్ చట్నీలో బల్లి పడడంతో అది తిన్న కొంతమంది వర్కర్లకు వాంతులు, విరేచనాలయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
కంపెనీ క్యాంటీన్ సిబ్బంది నిర్లక్ష్యం వలన చట్నీలో బల్లి పడినప్పటికి గమనించకపోవడంతో వర్కర్లు టిఫిన్ చేసి పని చేస్తుండగా దాదాపు 20 మంది అస్వస్తతకు గురయ్యారు. కంపెనీ యాజమాన్యం క్యాంటీన్ మెయింటనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలా జరిగిందని వర్కర్లు ఆరోపించారు.