పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దు : ​ రాజర్షి షా

కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రభుత్వ విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులు, పిల్లల పౌష్టికా హారం విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ కలెక్టర్ ​రాజర్షి షా హెచ్చరించారు.  బుధవారం సాయంత్రం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో పోషణ చర్చా కార్యక్రమంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

జిల్లాలోని అన్ని స్కూళ్లు, హాస్టళ్లు, కాలేజీలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సరఫరాపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందేలా తనిఖీ అధికారులను నామినేట్ చేయనున్నట్లు చెప్పా. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ పోషణ్ చర్చా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరారు.