ఆసిఫాబాద్, వెలుగు: మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన షహీద్ మంగళవారం రాత్రి మహారాష్ట్ర నుంచి వాంకిడి వైపు ఆటోలో అనుమానాస్పదంగా వస్తుండగా పోలీసులు ఆ ఆటోను తనిఖీ చేయడంతో 30 గుట్కా బ్యాగులు లభించాయి.
పట్టుబడిన వాటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తనిఖీల్లో ఏఎస్ఐ పోశెట్టి, హెడ్ కానిస్టేబుల్ శ్యాంరావు, కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.