అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

ఆసిఫాబాద్ , వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని వీర ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా బొలెరో వాహనంలో మహారాష్ట్ర వైపు నుంచి ఆసిఫాబాద్ లో విక్రయించేందుకు ఎనిమిది పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

 వారి వద్ద పశువులకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో, అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారి మొహమ్మద్ మోహిముద్దీన్ అలీ, అదే సోనేరావ్‌ , రియాజ్ ఖురేశి  హైదరాబాద్ కు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పశువులను కాగజ్ నగర్ గోశాలకు తరలించినట్లు తెలిపారు..