రూ.11 వేల 650 కోట్ల అప్పు తీర్చిన వోడాఫోన్ గ్రూప్

వొడాఫోన్ ఐడియా షేర్లపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించింది..వొడాఫోన్ గ్రూప్ 11వేల 650 కోట్లు బకాయిలను క్లియర్ చేసింది. శనివారం ( డిసెంబర్ 28) హెచ్ ఎస్ బీసీ కార్పొరేట్ ట్రస్టీ కంపెనీ ఈ వివరాలను విడుదల చేసింది. 

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. యూకె కు చెందిన వొడాఫోన్ గ్రూప్..దాదాపు 11వేల650 కోట్లు (1096 మిలియన్ పౌండ్లు) బకాయిలను క్లియర్ చేసింది. రుణదాతలకు సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరిస్తున్న HSBC కార్పొరేట్ ట్రస్టీ కంపెనీ (UK) లిమిటెడ్ లకు చెల్లించింది. వొడాఫోన్ గ్రూప్ రుణాన్ని పొందేందుకు VIL లో దాదాపు తన మొత్తం వాటాను తాకట్టు పెట్టింది.  

Also Read :- ఇంటి ఖర్చుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్..తెలంగాణ 3వ స్థానం

శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ ముగిసే సమయాని వోడాఫోన్ ఐడియా షేరు ముగింపు ధర రూ.7.41.. షేర్ల విలువ దాదాపు రూ.11,649 కోట్లు. సెప్టెంబర్ 30, 2024 నాటికి వొడాఫోన్ కంపెనీ షేర్లలో వొడాఫోన్‌ గ్రూపునకు 22.56 శాతం వాటా ఉండగా ఆదిత్య బిర్లా గ్రూపునకు 14.76 శాతం వాటా ఉంది. ప్రభుత్వానికి 23.15 శాతం వాటా ఉంది.